Dadasaheb Phalke International Film Festival Awards : దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డులు.. బెస్ట్ డైరెక్టర్‌గా సందీప్ రెడ్డి వంగ..

బాలీవుడ్ పరిశ్రమలో ఎంతో ప్రెస్టీజియస్ గా నిర్వహించే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డుల్లో సందీప్ రెడ్డి వంగ బెస్ట్ డైరెక్టర్ గా అవార్డుని అందుకున్నారు.

Dadasaheb Phalke International Film Festival Awards : దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డులు.. బెస్ట్ డైరెక్టర్‌గా సందీప్ రెడ్డి వంగ..

2024 Bollywood Dadasaheb Phalke International Film Festival Award winners list

Dadasaheb Phalke International Film Festival Awards : బాలీవుడ్ పరిశ్రమలో ఎంతో ప్రెస్టీజియస్ గా నిర్వహించే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డుల వేడుక.. నిన్న ఫిబ్రవరి 20న ముంబైలో ఘనంగా జరిగింది. 2023 చిత్రాలకు గాను ఈ అవార్డులను అనౌన్స్ చేశారు. ఇక ఈ ప్రతిష్టాత్మక పురస్కారంలో మన టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. రణబీర్ కపూర్ తో తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్ గా అవార్డుని అందుకున్నారు.

Also read : Kalki 2898 AD : ‘కల్కి’ డబ్బింగ్ పనులు మొదలయ్యాయి.. మార్చి నుంచి..

ఇక జవాన్ సినిమాకు గాను షారుఖ్ ఖాన్ ‘బెస్ట్ యాక్టర్’, నయనతార ‘బెస్ట్ యాక్ట్రెస్’ అవార్డులను సొంతం చేసుకున్నారు. వీరితో ఈ అవార్డుల పురస్కారం విజేతలుగా నిలిచిన ఆ విన్నర్స్ ఎవరో చూసేయండి.
బెస్ట్ యాక్టర్ – షారుఖ్ ఖాన్ (జవాన్)
బెస్ట్ డైరెక్టర్ – సందీప్ రెడ్డి వంగ (యానిమల్)
బెస్ట్ యాక్ట్రెస్ – నయనతార (జవాన్)
బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్) – విక్కీ కౌశల్ (సామ్ బహదూర్)
బెస్ట్ యాక్టర్ నెగటివ్ రోల్ – బాబీ డియోల్ (యానిమల్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – అనిరుద్ రవిచందర్ (జవాన్)
బెస్ట్ ప్లేబాక్ సింగర్ (మేల్) – వరుణ్ జైన్, తేరే వస్తే (జర హాట్కే జర బచ్కే)
బెస్ట్ యాక్ట్రెస్ టెలివిషన్ సిరీస్ – రూపాలి గంగూలీ (అనుపమా)
బెస్ట్ యాక్టర్ టెలివిషన్ సిరీస్ – నెయిల్ భట్, (ఘుమ్ హాయ్ కిసీకే ప్యార్ మే)
టెలివిషన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ – ఘుమ్ హాయ్ కిసీకే ప్యార్ మే
బెస్ట్ యాక్ట్రెస్ వెబ్ సిరీస్ – కరిష్మా తన్న (స్కూప్)
అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు ది ఫిలిం ఇండస్ట్రీ – మౌషమి ఛటర్జీ
అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు ది మ్యూజిక్ ఇండస్ట్రీ – కెజె ఏసుదాస్
వీరితో పాటు జవాన్ డైరెక్టర్ అట్లీ, షాహిద్ కపూర్, దర్శక ద్వయం రాజ్ & డీకే.. అవార్డులను అందుకున్నారు.