Naga Chaitanya : ఇన్‌స్టాలో యువసామ్రాట్ నాగ చైతన్య సెన్సేషన్..

‘యువసామ్రాట్’ అక్కినేని నాగ చైతన్య ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య 3 మిలియన్ల మార్క్ క్రాస్ చేసింది..

Naga Chaitanya : ఇన్‌స్టాలో యువసామ్రాట్ నాగ చైతన్య సెన్సేషన్..

3 Million Followers For Yuvasamrat Naga Chaitanya In Instagram

Updated On : June 30, 2021 / 3:47 PM IST

Naga Chaitanya: మిగతా స్టార్లతో పోలిస్తే యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సోషల్ మీడియాలో కాస్త స్లోగానే ఉంటారని చెప్పాలి. ఏదైనా అకేషన్ అయితే తప్ప ఆయన పెద్దగా పోస్టులవీ చెయ్యరు.

కానీ ట్విట్టర్, ఇన్‌‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌‌ఫాంలలో ఫ్యాన్స్, నెటిజన్స్ చైతుని బాగానే ఫాలో అవుతుంటారు. అందుకే ఇప్పుడు నాగ చైతన్య ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య 3 మిలియన్ల మార్క్ క్రాస్ చేసింది. చైతుకి ట్విట్టర్ కంటే ఇన్‌స్టా ఫాలోవర్సే ఎక్కువ మంది ఉన్నారు. ట్విట్టర్‌లో 2.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతు, సాయి పల్లవితో కలిసి యాక్ట్ చేసిన ‘లవ్ స్టోరీ’ మూవీ రిలీజ్‌కి రెడీగా ఉంది. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్‌తో చేస్తున్న ‘థ్యాంక్యూ’ రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. తర్వాత ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు యువసామ్రాట్ నాగ చైతన్య.