6 Journey Movie : సూసైడ్ చేసుకుందామనుకున్నాడు.. సూసైడ్ చేసుకుందామని గోవాకి వెళ్లే కథతో ఇప్పుడు డైరెక్టర్ గా..

6 జర్నీ సినిమా మే 9న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

6 Journey Movie : సూసైడ్ చేసుకుందామనుకున్నాడు.. సూసైడ్ చేసుకుందామని గోవాకి వెళ్లే కథతో ఇప్పుడు డైరెక్టర్ గా..

6 Journey Movie Director Bashir Aaluri Tells about his Life and Movie

Updated On : May 7, 2025 / 6:23 PM IST

6 Journey Movie : రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘6 జర్నీ’. పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై పాల్యం రవి ప్రకాష్ రెడ్డి నిర్మాణంలో బసీర్ ఆలూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. 6 జర్నీ మే 9న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

ప్రమోషన్స్ లో భాగంగా నేడు డైరెక్టర్ బసీర్ ఆలూరి మీడియాతో మాట్లాడాడు. బసీర్ ఆలూరి మాట్లాడుతూ.. సినిమాల మీద ఇష్టంతో అనంతపూర్ నుంచి హైదరాబాద్ వచ్చాను కానీ ఇక్కడ చాలా కష్టాలు పడ్డాను. ఒకానొక సమయంలో తినడానికి తిండి, ఉండటానికి చోటు కూడా లేకుండా పోయింది. అలాంటి సమయంలో సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. అలాంటి పరిస్థితుల నుంచే పలువురు డైరెక్టర్స్ వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసి, ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీలో పనిచేసాను. డైరెక్టర్ గా మారి గతంలో తెలుగులో సమరం, కన్నడలో ఒక సినిమా చేశాను. ఈ 6 జర్నీ నా మూడో సినిమా అని తెలిపారు.

Also Read : Odela 2 : తమన్నా అఘోరిగా నటించిన ‘ఓదెల 2’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు? ఎందులో?

ఈ 6 జర్నీ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇది ఆరుగురి జీవిత ప్రయాణం. వాళ్లంతా సూసైడ్ చేసుకోవాలి అనుకుంటారు. దాని ముందు గోవా ట్రిప్‌ను ఎంజాయ్ చేసి చనిపోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో వారికి ఎదురైనా ఇబ్బందులు ఏంటి? బతకాలి అని కోరిక కలిగించిన పరిస్థితులు ఏంటి అనే కథతో తెరకెక్కించాను. క్లైమాక్స్ బాగుంటుంది. శ్రీరాముడు పుట్టిన నేల మీద ఉగ్రవాదులు దాడి చేయడం ఏంటి? ఇక్కడ యువత ఎలా పోరాడాలి అంటూ దేశ భక్తిని రేకెత్తించేలా ఉంటుంది అని తెలిపారు.

ఈ సినిమాలో నటించిన వల్ల గురించి చెప్తూ.. అంతా కొత్తవాళ్లతో ఈ సినిమా చేశాను. సమీర్, పల్లవి జంట బాగా నటించింది. విలన్‌గా అభిరాం అని కొత్త అబ్బాయి నటించాడు. తిండిపోతు పాత్రలో టేస్టీ తేజ నవ్విస్తాడు. మ్యూజిక్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్ కూడా కొత్తవాళ్లే. నిర్మాతది మా ఊరే. ఆయనకు సినిమా అంటే చాలా ఇష్టం. సినిమాలో ఓ పాత్ర కూడా చేశారు అని తెలిపారు.

Also Read : NTR – Komalee Prasad : నేను ఎన్టీఆర్ కి హార్డ్ కోర్ ఫ్యాన్ ని.. మా నాన్న చనిపోయాక ఎన్టీఆర్ స్పీచ్ ఒకటి..

అలాగే.. వర్షాకాలంలో ఈ సినిమా షూటింగ్ చేయడంతో వర్షాలు పడి చాలా సమస్యలు వచ్చి సినిమా లేట్ అయింది. దాంతో బడ్జెట్ కూడా పెరిగింది అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా తర్వాత అక్టోబర్‌లో ఓ సినిమాను మొదలుపెడుతున్నాను, అది ముంబై బ్యాక్ డ్రాప్‌లో ఉంటుంది అని తెలిపారు.