నితిన్ గుండెజారి 6 ఏళ్ళయ్యింది

6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గుండెజారి గల్లంతయ్యిందే..

  • Published By: sekhar ,Published On : April 19, 2019 / 10:06 AM IST
నితిన్ గుండెజారి 6 ఏళ్ళయ్యింది

Updated On : April 19, 2019 / 10:06 AM IST

6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గుండెజారి గల్లంతయ్యిందే..

నితిన్, నిత్యా మీనన్ జంటగా, విజయ్ కుమార్ కొండని దర్శకుడిగా పరిచయంచేస్తూ, విక్రమ్ గౌడ్ సమర్పణలో, నిఖితా రెడ్డి నిర్మించిన సినిమా.. గుండెజారి గల్లంతయ్యిందే.. 2013 ఏప్రిల్ 19 న రిలీజ్ అయిన ఈ సినిమా 2019 ఏప్రిల్  19 నాటికి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. యూత్‌కి కనెక్ట్ అయ్యే స్టోరీ, బ్యూటిఫుల్ లవ్‌ట్రాక్, అందమైన మాటలు, అద్భుతమైన పాటలు, నితిన్, నిత్యాల కెమిస్ట్రీ, ఆండ్రూ విజువల్స్ సినిమాకి హైలెట్ అయ్యాయి. బాలీవుడ్ బ్యూటీ ఇషా తల్వార్ సెకండ్ హీరోయిన్‌గా నటించగా, మధు నందన్, అలీ, తాగుబోతు రమేష్, రఘబాబు తదితరులు ఇతర పాత్రల్లో ఆకట్టుకున్నారు.

బ్యాడ్మింటన్ స్టార్ గుత్తాజ్వాల స్పెషల్ సాంగ్‌లో ఫస్ట్ టైమ్ సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాలోని ఏమయ్యిందో ఏమో ఈవేళ  సాంగ్‌ని ఈ సినిమాలో రీమిక్స్ చెయ్యడం విశేషం.. 142 సెంటర్స్‌లో 50 రోజులు, ముఖ్యమైన మెయిన్ సెంటర్స్‌లో 100 రోజులు ఆడింది గుండెజారి గల్లంతయ్యిందే.

వాచ్ గుండెజారి గల్లంతయ్యిందే వీడియో సాంగ్..