777 Charlie : కుక్కకు బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు.. 777 చార్లీ సినిమా కుక్క పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిపోయి..

777 చార్లీ సినిమా చూశాక అంతా సినిమాలో నటించిన కుక్కకు ఫ్యాన్స్ అయిపోయారు. సినిమాలో కుక్క నటనకు ఫిదా అయిపోయారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఇన్నాళ్లు సినిమాల్లో నటించిన వాళ్లకు అవార్డులు ఇవ్వడం చూశాం. తాజాగా ఈ సినిమాలో నటించిన కుక్కకు అవార్డు ఇచ్చారు.

777 Charlie : కుక్కకు బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు.. 777 చార్లీ సినిమా కుక్క పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిపోయి..

777 Charlie Dog Received Best Performer award

Updated On : June 4, 2023 / 7:37 AM IST

777 Charlie Dog :  గత సంవత్సరం కన్నడలో వచ్చిన బెస్ట్ సినిమాల్లో 777 చార్లీ ఒకటి. ఒక కుక్కతో ఎమోషనల్ గా కనెక్ట్ అయిన ఓ మనిషి కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో హీరోగా రక్షిత్ శెట్టి నటించగా మెయిన్ లీడ్ మాత్రం కుక్కే పోషించింది. లాబ్రడార్ అనే జాతికి చెందిన చార్లీ అనే కుక్కను ఇందులో నటింపచేశారు. ఈ సినిమా కన్నడలోనే కాక దేశవ్యాప్తంగా మంచి విజయం సాధించింది. కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది 777 చార్లీ.

777 చార్లీ సినిమా చూశాక అంతా సినిమాలో నటించిన కుక్కకు ఫ్యాన్స్ అయిపోయారు. సినిమాలో కుక్క నటనకు ఫిదా అయిపోయారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఇన్నాళ్లు సినిమాల్లో నటించిన వాళ్లకు అవార్డులు ఇవ్వడం చూశాం. తాజాగా ఈ సినిమాలో నటించిన కుక్కకు అవార్డు ఇచ్చారు. కన్నడ సినీ పరిశ్రమలో చిత్తారా మీడియా ప్రతి సంవత్సరం అవార్డులు ఇస్తుంది.

Sharwanand : ఓ ఇంటివాడైన శర్వానంద్.. మోగిన పెళ్లి బాజాలు..

ఈ సారి 2022లో వచ్చిన సినిమాలకు గాను అవార్డులు ఇవ్వగా ఈ అవార్డుల్లో బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు 777 చార్లీ సినిమాలో కుక్కకు ఇచ్చారు. అద్భుతంగా ఆ కుక్క నటించిందంటూ ఈ అవార్డును కుక్కకు అందించారు. కుక్క కూడా ఈ అవార్డు వేడుకకు వచ్చి స్టేజిపైకి ఎక్కి అవార్డు అందుకోవడం విశేషం. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది. సినిమాల్లో నటించిన ఒక కుక్కకు అవార్డు ప్రకటించడం మన దగ్గర బహుశా ఇదే మొదటిసారి కావొచ్చు. అవార్డు అందుకుంటున్న చార్లీ(కుక్క) ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.