Madhuram : 90స్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీ.. ‘మధురం’.. ఎ మెమొరబుల్ లవ్

తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు.

Madhuram : 90స్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీ.. ‘మధురం’.. ఎ మెమొరబుల్ లవ్

90s Backdrop Love Story Madhuram Movie Pre Release Event

Updated On : April 16, 2025 / 4:57 PM IST

Madhuram : ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై యం.బంగార్రాజు నిర్మాణంలో రాజేష్ చికిలే దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మధురం. ఎ మెమొరబుల్ లవ్ అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ రిలీజ్ చేసారు. ఏప్రిల్ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్పీ పట్నాయక్, రఘు కుంచె, డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా గెస్టులుగా హాజరయ్యారు.

మధురం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. 2008లో నేను ఫస్ట్ డైరెక్షన్ చేసిన సినిమా ‘అందమైన మనసులో’. అది పదమూడేళ్ల అమ్మాయి లవ్ స్టోరీ. ఆ టైమ్‌లో సినిమా చూసినవాళ్లంతా పదేళ్ల తర్వాత రావాల్సిన సినిమా ఇది అన్నారు. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రావడం ఆనందంగా ఉంది అని అన్నారు.

Also Read : Bobby Deol : ఒకప్పుడు భార్య సంపాదన మీద బతికి.. ఇప్పుడు రీ ఎంట్రీలో ఖరీదైన కార్ కొన్న బాలీవుడ్ స్టార్.. కార్ విలువ ఎన్ని కోట్లు తెలుసా?

రఘుకుంచె మాట్లాడుతూ.. ఈ సినిమాలో పాటలన్నీ మధురంగా ఉన్నాయి. 90స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్ లవ్ స్టోరీకి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాంటి కంటెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమా హిట్ అవుతుంది అని అన్నారు. డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా మాట్లాడుతూ.. టైటిల్ ఎంత మధురంగా ఉందో సినిమా కూడా అంతే మధురంగా ఉంటుంది. తొంభైల కాలంలోని స్వచ్ఛమైన ప్రేమను ఇందులో చూపిస్తున్నారు అని తెలిపారు.

Madhuram

హీరో ఉదయ్ రాజ్ మాట్లాడుతూ.. మా ట్రైలర్ రిలీజ్ చేసిన వినాయక్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా పూర్తి చేయడానికి నిర్మాత బంగార్రాజు గారు చాలా సపోర్ట్ చేశారు. నైంటీస్ కథ కావడంతో చాలా కేర్ తీసుకుని తీశారు అని చెప్పారు. డైరెక్టర్ రాజేష్ చికిలే మాట్లాడుతూ.. ఈ కథను ఎంత బాగా రాసుకున్నానో అంతే పర్ఫెక్ట్ టీమ్ కుదిరింది అని అన్నారు. నిర్మాత బంగార్రాజు మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా మధురంగా ఉంటుంది. సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుంది అని అన్నారు.

Also Read : Pooja Hegde : పూజ హెగ్డే తాతయ్య నేషనల్ లెవల్ అథ్లెట్ అని తెలుసా? ఆ రికార్డు కూడా పూజ తాతయ్య పేరు మీదే..