Shruti Haasan : ముంబై ఎయిర్‌పోర్టులో శృతిహాసన్‌ని భయపెట్టిన అభిమాని.. వీడియో వైరల్
SIIMA అవార్డు వేడుకల్లో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన శృతిహాసన్ రీసెంట్ గా ఇండియా తిరిగి వచ్చింది. అయితే ముంబై ఎయిర్ పోర్టులో..

A fan who scared Shruti Haasan at Mumbai airport video viral
Shruti Haasan : హీరోయిన్ శృతిహాసన్ ఇటీవల SIIMA అవార్డు వేడుకల్లో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఆ వేడుకలో పాల్గొని అవార్డు అందుకున్న ఈ భామ రీసెంట్ గా ఇండియా తిరిగి వచ్చింది. దుబాయ్ నుంచి ముంబై చేరుకున్న శృతిహాసన్.. ముంబై ఎయిర్ పోర్టులో ఒక విచిత్రమైన సంఘటన ఎదురైంది. ఒక అభిమాని వాళ్ళ భయానికి గురై కంగారు పడింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
NC23 : నాగచైతన్య మూవీలోకి సాయి పల్లవి ఎంట్రీ ఇచ్చిందా..? వీడియో వైరల్..
ముంబై ఎయిర్ పోర్టు లోపల నుంచి పార్కింగ్ ఏరియాలో ఉన్న కారు దగ్గరకు వెళ్తున్న శృతిహాసన్ ని ఒక అభిమాని కంగారు పెట్టాడు. శృతిహాసన్ పక్కనే నడుస్తూ తనని భయానికి గురి చేశాడు. ఆమె ఆగి అతడిని ఎవరు అని ప్రశ్నించగా అతను దూరంగా వెళ్ళిపోయాడు. అయితే శృతి అక్కడి నుంచి ముందుకు వెళ్తుంటే.. ఆ వ్యక్తి మళ్ళీ శృతిహాసన్ వెనుక వచ్చాడు. అలా ఆమె కారు ఎక్కేవరకు అతడు ఫాలో అవుతూనే ఉన్నాడు. దీంతో శృతిహాసన్ భయపడిపోయి.. వెంటనే కారు ఎక్కి వెళ్లిపోయింది.
Rajinikanth : జైలర్ సినిమా నాకు ఎబోవ్ యావరేజ్ అనిపించింది.. రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు..
View this post on Instagram
ఇక శృతిహాసన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి సలార్ (Salaar) సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ నెలలో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ గ్రాఫిక్స్ విషయంలో పోస్ట్‌పోన్ అయ్యినట్లు తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు నాని ‘హాయ్ నాన్న’ సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తుందని సమాచారం. అయితే దీని గురించి మూవీ టీం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. అలాగే ‘ది ఐ’ అనే ఒక ఇంగ్లీష్ సినిమాలో కూడా నటిస్తుంది.