Hari Hara Veera Mallu : వీరమల్లు స్టోరీ అలా ఉంటుంది.. నిర్మాత కొడుకు కామెంట్స్..

AM రత్నం కొడుకు జ్యోతి కృష్ణ హరిహరవీరమల్లు స్టోరీ ఎలా ఉండబోతూవుందో చెప్పేశాడు.

Hari Hara Veera Mallu : వీరమల్లు స్టోరీ అలా ఉంటుంది.. నిర్మాత కొడుకు కామెంట్స్..

A M Rathnam son about Hari Hara Veera Mallu story

Updated On : September 21, 2023 / 4:04 PM IST

Hari Hara Veera Mallu : AM రత్నం నిర్మాణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) యోధుడిగా కనిపిస్తూ చేస్తున్న సినిమా ‘హరిహరవీరమల్లు’. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘ఖుషి’ వంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. దీంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ ఎలా ఉండబోతుందో అనేది నిర్మాత తనయుడు జ్యోతి కృష్ణ తెలియజేశాడు. ఒక మూవీ ప్రమోషన్స్ లో ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ వస్తున్న జ్యోతి కృష్ణని హరిహరవీరమల్లు ఎలా ఉండబోతుంది అంటూ ప్రశ్నించారు.

Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ టీం వార్నింగ్ నోట్.. ఇక నుంచి అలా చేస్తే..

జ్యోతి కృష్ణ బదులిస్తూ.. “తమ నుంచి గతంలో కర్తవ్యం, భారతీయుడు, జెంటిల్ మెన్, ఒకే ఒక్కడు వంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీరమల్లు కూడా అలాగే ఉంటుంది. అలాగే కమర్షియల్ ఫిలింగా కాకుండా ఇండియా కల్చర్ ని డెవలప్ చేసేలా వీరమల్లు ఉంటుంది. ఒక ట్రెండ్ సెట్టర్ గా ఈ మూవీ ఉంటుందని చెబుతాను” అంటూ వెల్లడించాడు. ఇక ఈ కామెంట్స్ తో పవన్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. పవన్ కూడా ముందు నుంచి ఈ చిత్రాన్ని ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు.

Sharwa35 : కృతిశెట్టికి బర్త్ డే విషెస్.. శర్వానంద్ సినిమా నుంచి స్పెషల్ వీడియో రిలీజ్..

ఇక ఇప్పుడు జ్యోతి కృష్ణ మాటలు బట్టి చూస్తే.. కథలో మెసేజ్ ఉండడం వలనే సినిమా ఆ సమయంలో తీసుకు వస్తే ఎన్నికలు కూడా ఉపయోగపడుతుందని పవన్ భావించవచ్చని తెలుస్తుంది. కాగా ఈ సినిమాని క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఆల్రెడీ 60 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ ఏడాది చివరికి ఈ మూవీ షూటింగ్ ని పూర్తి చేసేలా చూస్తున్నట్లు నిర్మాత ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో వెల్లడించాడు. నిధి అగ‌ర్వాల్ (Nidhhi Agerwal) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.