హీరోయిన్‌తో పెళ్లి ఫిక్స్!..

సీనియర్ దర్శకులు రవిరాజా పినిశెట్టి వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా తక్కువ టైంలోనే ప్రతిభ గల నటుడిగా అటు కోలీవుడ్‌లోనూ ఇటు టాలీవుడ్‌లోనూ గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో ఆది పినిశెట్టి. త్వరలో ఈ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడట. తనతో కలిసి రెండు సినిమాల్లో నటించిన హీరోయిన్ నిక్కీ గల్రానీని వివాహం చేసుకోబోతున్నాడట. కొద్ది రోజులుగా తమిళ మీడియాలో ఆది పినిశెట్టి పెళ్లి వార్త హల్‌చల్ చేస్తోంది.
‘మలుపు’, ‘మరకతమణి’ చిత్రాల్లో ఆది, నిక్కీ కలిసి నటించారు. వీరు కొద్ది కాలంగా డేటింగ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన రవిరాజా పినిశెట్టి బర్త్‌డే వేడుకల ఫొటోల్లో కూడా నిక్కీ కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
కరోనా సమస్య తొలిగిపోయిన తర్వాత తన పెళ్లి గురించి ఆది ప్రకటన చేయబోతున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే తమ పెళ్లి గురించి జోరుగా వార్తలు వస్తున్నా ఆది, నిక్కీ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. ఆది అన్న సత్య ప్రభాస్ పినిశెట్టి ‘మలుపు’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.