Crazy Fellow Teaser: ‘క్రేజీ ఫెలో’ టీజర్ టాక్.. ఫుల్‌టూ ఎంటర్‌టైనర్!
టాలీవుడ్‌లో హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసబెట్టి సినిమాలు చేసే యంగ్ హీరో ఆది సాయి కుమార్, ప్రస్తుతం ‘క్రేజీ ఫెలో’అనే సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Aadi Sai Kumar Crazy Fellow Teaser Impressive
Crazy Fellow Teaser: టాలీవుడ్‌లో హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసబెట్టి సినిమాలు చేసే యంగ్ హీరో ఆది సాయి కుమార్, ప్రస్తుతం పలు ఆసక్తికర చిత్రాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్రేజీ ఫెలో’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా టైటిల్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
Crazy Fellow: ‘క్రేజీ ఫెలో’ రిలీజ్ డేట్ లాక్ చేసిన ఆది సాయికుమార్!
ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా నుండి టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తే, ఆది సాయికుమార్ ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. ఫుల్‌టూ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతున్నట్లు ఈ టీజర్ చూస్తే ఇట్టే అర్థమవుతోంది. కూల్‌గా ఉండే కుర్రాడిగా ఆది ఈ సినిమాలో పూర్తిగా ఎంటర్‌టైనింగ్ చేసే పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు ఫణి కృష్ణ సిరికి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో దిగంగనా సూర్యవంశీ, మిర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Aadi SaiKumar : ఆది సాయి కుమార్ హీరోగా, సునీల్ కీ రోల్‌లో సినిమా..
ఈ సినిమాకు ధృవన్ సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రాన్ని అక్టోబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ‘క్రేజీ ఫెలో’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.