Aamir Khan : హిమాచల్ ప్రదేశ్ విపత్తు బాధితులకు అమీర్ ఖాన్ రూ. 25 లక్షలు విరాళం
భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అయ్యింది. అనేకమంది సర్వస్వం కోల్పోయారు. ఈ ఘటనలో బాధితుల కోసం బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తనవంతు సాయంగా రూ.25 లక్షలు విరాళం ఇచ్చారు.

Aamir Khan
Aamir Khan : హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో నష్టపోయిన వారికి సాయం చేసేందుకు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ముందుకొచ్చారు. తనవంతు సాయంగా రూ.25 లక్షలు విరాళం ఇచ్చారు.
Heavy Rains: 80 మంది మృతి, 4 వేల కోట్ల ఆస్తి ధ్వంసం.. హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల నష్టమిది
హిమాచల్ ప్రదేశ్ విపత్తు కారణంగా నష్టపోయిన కుటుంబాలకు అమీర్ ఖాన్ రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఠాకూర్ సుఖ్‌విందర్ సింగ్ సుఖు అమీర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో అపారమైన నష్టం కలిగింది. అనేక భవనాలు కూలిపోయాయి. దీని కారణంగా చాలా కుటుంబాలు ఆశ్రయం కోల్పోయాయి. అధిక వర్షపాతం కారణంగా పలు చోట్ల భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో మణిపూర్ లాంటి ఘటన.. సీఎం సొంత ప్రాంతంలోనే ఉన్మాదపు ఘటన
ఇక అమీర్ ఖాన్ విషయానికి వస్తే అమీర్ ఖాన్, జ్యోతి దేశ్ పాండే నిర్మించిన సినిమా ‘లాపటా లేడీస్’. కిరణ్ రావు డైరెక్ట్ చేసిన లాపటా లేడీస్‌ను టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. దీనిపై మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో నితాన్షి గోయెల్, ప్రతిభా రంతా, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్ మరియు రవి కిషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 8 న టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో (TIFF) గ్రాండ్ ప్రీమియర్‌లో ప్రదర్శించారు. ఈ చిత్రం జనవరి 5, 2024న విడుదల కానుంది.