Aishwarya Rai – Abhishek Bachchan : ఐశ్వర్య రాయ్‌తో విడాకులు.. అభిషేక్ బచ్చన్ రియాక్షన్!
బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారా? ట్విట్టర్ లో నెటిజెన్ చేసిన ట్వీట్ కి అభిషేక్ ఏమని రిప్లై ఇచ్చాడు?

Abhishek Bachchan reaction on divorce with Aishwarya Rai
Aishwarya Rai – Abhishek Bachchan : బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈ వార్తలు బి టౌన్ లో టాక్ అఫ్ ది టౌన్ అయ్యిపోయాయి. ఈమధ్య కాలంలో ఐశ్వర్య అండ్ అభిషేక్ బయట ఏ ఫంక్షన్ లో కలిసి కనిపించడం లేదు. ఇటీవల ముంబైలో జరిగిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంఛ్ ఈవెంట్‌కు కూడా ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో మాత్రమే కలిసి రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
Amitabh Bachchan : తన ఇమేజ్‌ని వాడుకుంటున్నారు అంటూ.. కోర్ట్‌ని ఆశ్రయించిన అమితాబ్..
దీంతో వీరిద్దరూ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి అని, అందుకనే ఐశ్వర్య ప్రతి ఫంక్షన్ అభిషేక్ లేకుండా తన కూతురు ఆరాధ్యతో హాజరవుతుందని, ఇటీవల వారిద్దరి మధ్య మనస్పర్థలు తారాస్థాయికి చేరుకోవడంతో విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు అంటూ బాలీవుడ్ మీడియా కథనాలు రాసుకొచ్చాయి. ఈ వార్తలు విన్న బచ్చన్ అభిమానులు చాలా బాధ పడ్డారు. తాజాగా ఈ వార్త పై అభిషేక్ బచ్చన్ క్లారిటీ ఇచ్చాడు. ఒక నెటిజెన్ ట్విట్టర్ వేదికగా.. ఐశ్వర్య అండ్ కూతురు ఆరాధ్య ఫోటో షేర్ చేస్తూ నా ఫేవరెట్ పీపుల్ అంటూ కామెంట్ చేసింది.
Madhavan : మరో సైంటిస్ట్ బయోపిక్‌తో రాబోతున్న మాధవన్..
దినికి అభిషేక్ స్పందిస్తూ.. నాకు కూడా వారిద్దరూ ఫేవరెట్ పీపుల్ అంటూ రీ ట్వీట్ చేశాడు. అభిషేక్ రిప్లైతో విడాకుల వార్తలు రూమర్స్ అని కొట్టి పడేశాడు. ఇక ఈ ట్వీట్ చూసిన బచ్చన్ అభిమానులు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ తమ సినిమాలతో కెరీర్ లో బిజీగా ఉండడమే వలనే ఇద్దరు కలిసి కనిపించడం లేదని నెటిజెన్లు అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.
Mine too. ☺️
— Abhishek ???????? (@juniorbachchan) April 1, 2023