Abhishek Bachchan : ఆమెకు నా పర్మిషన్ అవసరం లేదు.. ఐశ్వర్యరాయ్ పై భర్త అభిషేక్ ట్వీట్ వైరల్..

తాజాగా పొన్నియిన్ సెల్వన్ సినిమాపై ఐశ్వర్యరాయ్ భర్త అభిషేక్ బచ్చన్ స్పెషల్ ట్వీట్ చేశాడు. నా భార్య ఐశ్వర్యరాయ్ వల్ల గర్వపడుతున్నాను. తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అని తెలిపాడు అభిషేక్.

Abhishek Bachchan : ఆమెకు నా పర్మిషన్ అవసరం లేదు.. ఐశ్వర్యరాయ్ పై భర్త అభిషేక్ ట్వీట్ వైరల్..

Abhishek Bachchan Tweet on Aishwarya Rai goes viral

Updated On : April 30, 2023 / 7:35 AM IST

Abhishek Bachchan :  ఒకప్పటి మిస్ వరల్డ్(Miss World), స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్(Aishwarya Rai) పెళ్లి తర్వాత కొన్ని రోజులు సినిమాలు చేసినా అనంతరం ఎక్కువగా సినిమాలు చెయ్యట్లేదు. అడపాదడపా కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ మాత్రమే ఎంచుకొని చేస్తుంది. తాజాగా ఐశ్వర్యరాయ్ పొన్నియిన్ సెల్వన్ 2(Ponniyin Selvan 2) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రెండు పార్ట్స్ లోను ఐశ్వర్యరాయ్ మెయిన్ లీడ్ గా మెప్పించింది. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 లో అయితే రెండు పాత్రల్లో కనిపించింది ఐశ్వర్యరాయ్.

తాజాగా పొన్నియిన్ సెల్వన్ సినిమాపై ఐశ్వర్యరాయ్ భర్త అభిషేక్ బచ్చన్ స్పెషల్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో.. పొన్నియిన్ సెల్వన్ 2 సింపుల్ గా సూపర్ ఉంది. మాటలు రావట్లేదు, చాలా అద్భుతంగా ఉంది. సినిమా టీం, మణిరత్నం సర్, విక్రమ్, జయం రవి, త్రిష, కార్తీ..అందరూ బాగా చేశారు. చిత్ర యూనిట్ అందరికి నా అభినందనలు. నా భార్య ఐశ్వర్యరాయ్ వల్ల గర్వపడుతున్నాను. తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అని తెలిపాడు అభిషేక్. దీంతో అభిషేక్ ట్వీట్స్ కి అభిమానులు, నెటిజన్లు రిప్లైలు ఇస్తున్నారు.

Salman Khan : పఠాన్ సినిమా నా వల్ల హిట్ అవ్వలేదు.. ఆ క్రెడిట్ వాళ్ళకే..

ఇందులో ఓ నెటిజన్.. ఇప్పుడైనా ఐశ్వర్యరాయ్ ని మరిన్ని సినిమాలకు సైన్ చేయనివ్వండి. ఆరాధ్యని మీరు చూసుకోండి అని రిప్లై ఇవ్వగా దానికి అభిషేక్ సమాధానం ఇస్తూ.. ఆమెను సైన్ చేయనివ్వడమేంటి సర్, ఏం చేయడానికైనా ఆమెకు నా పర్మిషన్ అవసరం లేదు. ముఖ్యంగా ఆమె ప్రేమించేవాటి కోసం అని రిప్లై ఇచ్చాడు. దీంతో అభిషేక్ ట్వీట్ వైరల్ గా మారింది. ఐశ్వర్యకు తన పర్మిషన్ అవసరం లేదు, ఏమైనా చేసుకోవచ్చు అన్నందుకు పలువురు నెటిజన్లు అభిషేక్ ని పొగుడుతున్నారు.