MS Chowdary : ‘సలార్’లో ఆ సీన్‌లో డూప్ చేస్తా అన్నా ప్రభాస్ వద్దని తనే చేశాడు.. ప్రభాస్‌ని కొట్టిన ఒకే క్యారెక్టర్ ఇతనే..
తాజాగా నటుడు MS చౌదరి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సలార్ సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలిపారు.

Actor MS Chowdary Interesting Comments on Prabhas and Salaar Movie
MS Chowdary : ప్రభాస్(Prabhas) సలార్(Salaar) సినిమా ఎంత భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ ఇండియా వైడ్ భారీ హిట్ కొట్టి ఏకంగా 700 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేశాడు. థియేటర్స్ లో అదరగొట్టిన సలార్ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతూ ట్రెండింగ్ లో ఉంది. ఓటీటీలో కూడా దేశవ్యాప్తంగా సలార్ సినిమా రికార్డులు సెట్ చేస్తుంది. ఈ సినిమాకి పార్ట్ 2 ప్రకటించగా అభిమానులు, ప్రేక్షకులు సలార్ 2 కోసం ఎదురుచూస్తున్నారు.
సలార్ సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. కొంతమంది అయితే ఇన్ని పాత్రలు ఉన్నాయా అని కన్ఫ్యూజ్ కూడా అయ్యారు. సలార్ సినిమాలో నటించి చాలామంది గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో MS చౌదరి ఒకరు. గతంలో ఎన్నో సినిమాల్లో నటించిన ఈయన సలార్ సినిమాలో నారంగ్ పాత్రలో నటించారు. దేవా(ప్రభాస్) నారంగ్ కొడుకు విష్ణుని చంపే సీన్ అదిరిపోతుంది. ఆ సీన్ తర్వాత దేవా, వరదలను అరెస్ట్ చేసి నారంగ్ వద్దకు తీర్పు కోసం తీసుకెళ్తారు. అక్కడ దేవా.. వరదని ఏం చెయ్యొద్దు అంటూ నారంగ్ కాళ్ళ మీద పడి బతిమాలుతాడు. నారంగ్ దేవాని కొట్టి తోసేసి వరదని పట్టుకుంటాడు. దీంతో దేవా మొదట నారంగ్ చెయ్యి నరికి ఆ తర్వాత తల నరుకుతాడు. ఈ సీన్ సినిమాకే హైలెట్ అయింది.
Also Read : Pawan Kalyan : పద్మ అవార్డులు అనగానే రికమెండ్ చేస్తారు.. కానీ మోదీగారు.. పవన్ సంచలన వ్యాఖ్యలు..
తాజాగా నటుడు MS చౌదరి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సలార్ సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ సినిమాలో ప్రభాస్.. MS చౌదరి కాళ్ళు పట్టుకునే సీన్ లో ప్రభాస్ డూప్ వచ్చి చేస్తానని చెప్పినా ప్రభాస్ పర్లేదు అని అతనికి వద్దని చెప్పి తనే చేశాడు అని తెలిపారు. అంత పెద్ద స్టార్ వచ్చి నా కాళ్ళు పట్టుకునే సీన్ చేయగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అని అన్నాడు. అలాగే ఈ సినిమా మొత్తంలో ప్రభాస్ ని కొట్టే క్యారెక్టర్ తనది ఒక్కడిదే అని చెప్పాడు. కాళ్ళు పట్టుకున్న సీన్ లో ప్రభాస్ ని తలపై కొట్టి తోసేస్తాడు. అలాగే సలార్ సక్సెస్ పార్టీ బెంగుళూరులో ఇచ్చినప్పుడు ప్రభాస్ పిలిచాడని, వెళ్లానని తెలిపాడు MS చౌదరి. దీంతో MS చౌదరి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారగా అభిమానులు ప్రభాస్ ని అభినందిస్తున్నారు.