Pawan Kalyan : పద్మ అవార్డులు అనగానే రికమెండ్ చేస్తారు.. కానీ మోదీగారు.. పవన్ సంచలన వ్యాఖ్యలు..
జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్ నేడు మంగళగిరిలో జనసేన కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో పద్మ అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan
Pawan Kalyan : నేడు రిపబ్లిక్ డే(Republic Day) సందర్భముగా ఈ సంవత్సరం ఇచ్చే పద్మ అవార్డులని నిన్న సాయంత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంట్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవికి(Chiranjeevi) భారతదేశ రెండో అత్యున్నత అవార్డు పద్మ విభూషణ్ ని ప్రకటించారు. తెలుగు సీనియర్ నాయకులు వెంకయ్య నాయుడుకు కూడా పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించారు. ఇలా దేశవ్యాప్తంగా ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డులు, 17 మందికి పద్మ భూషణ్ అవార్డులు, 110 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. ఈ సందర్భంగా వీరందరికి దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్ నేడు మంగళగిరిలో జనసేన కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో పద్మ అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన వెంకయ్యనాయుడు గారికి, మా పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. మిగతా అవార్డు గ్రహీతలకు నా అభినందనలు. నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలుపుతున్నాను. పద్మ అవార్డులు అనగానే చాలామంది రికమెండ్ చేస్తారు, వీళ్ళకి ఇవ్వండి, వాళ్లకి ఇవ్వండి అని. కానీ మోదీ గారు ఇవన్నీ పక్కన పెట్టి ట్యాలెంట్, ప్రతిభ, త్యాగం ఎక్కడ ఉంది అని వెతుక్కొని దేశం నలుమూలల నుంచి వ్యక్తులని సెలెక్ట్ చేసి పద్మ అవార్డులు ఇవ్వడం అనేది ఆయనకే చెల్లింది. ఇందుకు ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను అన్నారు. దీంతో పవన్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
#PadmaVibhushan #PadmaVibhushanChiranjeevi #MegastarChiranjeevi :
పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి, మా పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి, అందరికీ అభినందనలు.
దేశం నలుమూలల నుండి ప్రతిభను, త్యాగాన్ని గుర్తించిన ప్రధానమంత్రి మోడీ గారికి… pic.twitter.com/B1Mfedypq1
— JanaSena Party (@JanaSenaParty) January 26, 2024