Naresh-Pavitra : పెళ్లి చేసుకున్న నరేష్-పవిత్ర.. వీడియోతో షాక్ ఇచ్చిన నరేష్..
తాజాగా నరేష్ ఈ సారి పవిత్రని పెళ్లి చేసుకున్న వీడియోని సడెన్ గా సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికి షాకిచ్చాడు. ఈ వీడియోలో నరేష్ - పవిత్ర సాంప్రదాయబద్దంగా గుడిలో పెళ్లి చేసుకున్నట్టు.......................

Actor Naresh married pavitra and video shared in social media naresh pavitra marriage goes viral
Naresh-Pavitra : టాలీవుడ్ లో ఇటీవల బాగా వైరల్ అయిన జంట సీనియర్ నటుడు నరేష్ – నటి పవిత్ర లోకేష్. ఓ సినిమాలో కలిసి నటించిన వీరు బయట కూడా చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో బాగా వైరల్ అయ్యారు. ఇక నరేష్ తన మూడో భార్యతో గొడవలు పడటం, ఇవి రోడ్డుకెక్కడం, పవిత్ర-నరేష్ కలిసి ఓ హోటల్ లో ఉన్నప్పుడు మూడో భార్య అక్కడికి రావడం.. ఈ రచ్చ అంతా సోషల్ మీడియాలో, వార్తల్లో బాగా ట్రెండ్ అయింది. దీంతో నరేష్-పవిత్ర లోకేష్ పై పలు వార్తలు, గాసిప్స్ వచ్చినా మొదట స్పందించకపోయినా 2023 న్యూ ఇయర్ సందర్భంగా అందరికి షాక్ ఇస్తూ వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి, ఇద్దరూ కలిసి కేక్ కట్ చేసి, లిప్ కిస్ ఇచ్చుకున్న ఓ వీడియోని షేర్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఆ తర్వాత నరేష్ మూడో భార్య రమ్య ఈ వీడియోపై స్పందిస్తూ వీళ్ళిద్దర్నీ పెళ్లి చేసుకోనివ్వను, నేను విడాకులు ఇవ్వను అంటూ రచ్చ చేసింది. ఆ తర్వాత నరేష్ పై దాడి, నరేష్ కోర్టుకి వెళ్లడం.. ఇలా అనేక సంఘటనలు జరిగాయి. తాజాగా నరేష్ ఈ సారి పవిత్రని పెళ్లి చేసుకున్న వీడియోని సడెన్ గా సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికి షాకిచ్చాడు. ఈ వీడియోలో నరేష్ – పవిత్ర సాంప్రదాయబద్దంగా గుడిలో పెళ్లి చేసుకున్నట్టు, నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టడం, ఏడడుగులు వేయడం, దండలు మార్చుకోవడం అంతా చూపించారు.
నరేష్ ఈ వీడియో షేర్ చేసి.. ఒక పవిత్ర బంధం.. రెండు మనసులు.. మూడు ముళ్ళు.. ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు పవిత్ర నరేష్ అని పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోతో మరోసారి నరేష్ పవిత్ర వార్తల్లో నిలిచారు. మరి దీనిపై నరేష్ మూడో భార్య ఎలా స్పందిస్తుందో చూడాలి.
అయితే కొంతమంది ఇది నిజం పెళ్లి కాదని ఏదైనా షూటింగ్ అయి ఉండొచ్చని అంటున్నారు. ఆ వీడియోలో చుట్టూ నరేష్ కి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరని, దేని కోసం అయినా షూట్ చేసి ఉండొచ్చని కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. అధికారికంగా నరేష్ పోస్ట్ చేయడంతో ఇది నిజమైన పెళ్లి, లాస్ట్ టైం కూడా ఇలాగే లిప్ కిస్ వీడియో షేర్ చేశాడు కదా అని అంటున్నారు మరికొంతమంది.
Seeking your blessings for a life time of peace & joy in this new journey of us?
ఒక పవిత్ర బంధం
రెండు మనసులు
మూడు ముళ్ళు
ఏడు అడుగులు ?మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు
– మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023