Niharika : అఫీషియల్‌.. విడాకులు తీసుకున్న నిహారిక- చైతన్య

గ‌త కొంత‌కాలంగా వ‌స్తున్న వార్త‌లే నిజం అయ్యాయి. న‌టి, నిర్మాత నిహారిక కొణిదెల (Niharika Konidela) త‌న భ‌ర్త‌ చెత‌న్య జొన్న‌ల గ‌డ్డ‌(Chaitanya jonnalagadda)తో అధికారికంగా విడిపోయింది.

Niharika : అఫీషియల్‌.. విడాకులు తీసుకున్న నిహారిక- చైతన్య

Niharika Divorce with Chaitanya

Updated On : July 4, 2023 / 8:52 PM IST

Niharika Divorce : గ‌త కొంత‌కాలంగా వ‌స్తున్న వార్త‌లే నిజం అయ్యాయి. న‌టి, నిర్మాత నిహారిక కొణిదెల (Niharika Konidela) త‌న భ‌ర్త‌ చెత‌న్య జొన్న‌ల గ‌డ్డ‌(Chaitanya jonnalagadda)తో అధికారికంగా విడిపోయింది. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం ఈ జంట కోర్టులో ద‌ర‌ఖాస్తు చేసుకోగా ఈ మ‌ధ్యే న్యాయ‌స్థానం విడాకులు మంజూరు చేసింది. కాగా.. వీరిద్ద‌రు విడిపోవ‌డానికి గ‌ల కార‌ణాలు మాత్రం తెలియ‌రాలేదు.

నటుడు, నిర్మాత నాగబాబు కూతురు అయిన నిహారిక కు గుంటూరు ఐజీ జె. ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డ ల‌తో డిసెంబ‌ర్ 9, 2022 వివాహం జ‌రిగింది. రాజ‌స్థాన్‌లో ఉద‌య్‌పూర్‌లోని ప్యాలెస్ వీరి పెళ్లికి వేదికైంది. వివాహామైన కొద్ది రోజుల‌కే వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్త‌డంతో గ‌త కొద్ది రోజులుగా వీరిద్ద‌రు వేరువేరుగా ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల్లో క‌లిసి దిగిన ఫోటోల‌ను తొల‌గించారు.

KH233 : ఉలగనాయగన్‌.. KH233 షురూ.. వీడియో షేర్ చేసిన క‌మ‌ల్ హాస‌న్‌

దీంతో ఈ జంట విడిపోతుంది అనే అనే వార్త‌లు తొలిసారి తెర‌పైకి వ‌చ్చాయి. అదే సమ‌యంలో మెగా కుటుంబంలో జ‌రిగిన వేడుక‌లు అన్నింటికి నిహారికి మాత్ర‌మే హాజ‌రుకావ‌డంతో ఆ వార్త‌ల‌కు బ‌లం చేకూరిన‌ట్లైంది. అయితే ఈ వార్త‌ల‌పై అటు మెగా ఫ్యామిలీ గానీ, ఇటు చైతన్య కుటుంబం గానీ స్పందించ‌లేదు. అయితే తాజాగా ఈ వార్త‌లే నిజం అయ్యాయి. వీరి పెళ్లి మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.

Niharika Konidela Divorce with Chaitanya jonnalagadda

Niharika Konidela Divorce with Chaitanya jonnalagadda

హైద‌రాబాద్‌లోని కూక‌ట్ ప‌ల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోగా జూన్ 5న న్యాయ‌స్థానం వీరికి విడాకులు మంజూరు చేసింది. కాగా ఈ రోజు ఆ కాపీ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Samantha : సమంత ఇన్‌స్టా పోస్ట్ వైర‌ల్‌.. ‘చావు నుంచి మ‌న‌ల్నీ ఏదీ కాపాడ‌లేన‌ప్పుడు’.. మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డిందా..?

ఇదిలా ఉంటే.. నాగ‌బాబు కూతురిగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది నిహారికి. కెరీర్ తొలినాళ్ల‌లో యాంక‌ర్‌గా, హోస్ట్‌గా న‌టించింది. ఆ త‌రువాత ఒక మ‌న‌సు, సూర్య‌కాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో హీరోయిన్‌గానూ మెప్పించింది. ముద్ద‌ప్పు ఆవ‌కాయ్‌, నాన్న‌కూచి, మ్యాడ్ హౌస్‌, డెడ్ పిక్సెల్స్ వంటి సినిమాలు, సిరీస్‌ల‌కు నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రించింది. ఆ మ‌ధ్య త‌న ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హ‌రాల‌కు సంబంధించిన ఓ కొత్త ఆఫీసును ఓపెన్ చేసిన సంగ‌తి తెలిసిందే.

Ram Charan : ఇదేం యాడ్‌రా బాబు.. ఏజెంట్ లెవ‌ల్‌లో చ‌ర‌ణ్‌తో మీషో యాడ్