దటీజ్ సోనూసూద్ : భర్తతో కలిసిఉండలేనన్న మహిళ..ఇద్దరినీ గోవా పంపిస్తానన్న రియల్ హీరో

లాక్ డౌన్ కష్టాల్లో ఉండే వలస కూలీలకు నటుడు సోనూసూద్ వలస కూలీలకు ఎంతగా సహాయం చేస్తున్నారో తెలిసిందే. మేము మా సొంత ఊర్లకు వెళ్లాలనుకుంటున్నాం..సహాయం చేయండా భయ్యా అంటూకొంతమంది అడుగుతుంటే..కొంతమంది మాత్రం విచ్చిత్రమైన కోరికలతో ట్వీట్ చేస్తున్నారు. పిచ్చి పిచ్చి కోరికలతో ట్వీట్ చేసేవారికి కూడా ఏమాత్రం విసుక్కోకుండా చక్కగా సమాధానాలు..సూచనలు ఇస్తున్నారు సోనూ. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ రీల్ లో విలన్ అయినా రియల్ హీరో అనిపించుకంటున్నారు.
ఈ క్రమంలో తన గర్ల్‌ఫ్రెండ్‌ను కలవాలని ఓ వ్యక్తి సోనూసూద్‌ను కోరాడు.దానిక ఓ చక్కటి సమాధానం కూడా ఇచ్చారు. అటువంటిదే మరొకటి వచ్చింది సోనూకు. లాక్‌డౌన్ కాలంలో తన భర్తతో కలిసి ఉండలేకపోతున్నానని, తనను భర్తతో వేరు చేయాలని సుష్రిమా ఆచార్య అనే మహిళ సోనూసూద్‌కు ట్విటర్ ద్వారా కోరింది.
ఆ మహిళ ట్వీట్ సారాంశం ఇలా ఉంది. ‘‘సోనూసూద్.. జనతా కర్ఫ్యూ నుంచి లాక్‌డౌన్-4 వరకు నేను నా భర్తతోనే కలిసి ఉంటున్నా..కానీ ఇకపై అతన్ని నేను భరించలేను..అతన్ని బయటకు పంపించండి. లేదా నన్ను మా అమ్మ వాళ్ల ఇంటికి పంపించండి…ఎందుకంటే ఇకపై నేను అతనితో కలిసి ఉండలేను’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి సోనూసూద్ తనదైన శైలిలో అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. మీ సమస్యకు ‘నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. మీ ఇద్దరిని గోవా పంపిద్దాం. ఏమంటారు’ అంటూ బదులిచ్చారు.
I have a better plan .. let me send both of you to Goa? What say? https://t.co/XbYNFWWflK
— sonu sood (@SonuSood) May 31, 2020
Read: లేటు వయస్సులో : ప్రగతి పర్‌ఫార్మెన్స్ పీక్స్ అండీ బాబూ..