కష్టం ఎక్కడుంటే అక్కడుంటా:‘నిసర్గ’బాధితులకు సోనూసూద్ అండ..వేలాదిమంది ఆకలి తీరుస్తూ..

  • Published By: nagamani ,Published On : June 5, 2020 / 05:23 AM IST
కష్టం ఎక్కడుంటే అక్కడుంటా:‘నిసర్గ’బాధితులకు సోనూసూద్ అండ..వేలాదిమంది ఆకలి తీరుస్తూ..

Updated On : June 5, 2020 / 5:23 AM IST

సినిమాల్లో స్టంట్లు చేసేస్తూ..సాహస విన్యాసాలు చేసినవారంతా హీరోలు కాదు. కష్టంలో ఉన్నవారికి నేనున్నాను అంటూ ముందుకొచ్చేవాడే అసలైన హీరో. రీల్ లైఫ్ లో పెద్ద పెద్ద ఫైటింగ్ లు చేస్తే అభిమానులతో చప్పట్లు కొట్టించుకునేవాడు కేవలం మొహానికి రంగు చెరగనంత వరకూ వాళ్లు హీరోలు. రంగు వెలిసిపోతే సాధారణ మనుషులే.కానీ కష్టం ఉన్న చోటే నేనుంటాను అన్నట్లుగా ప్రముఖ నటుడు వలస కూలీలకు దేవుడిగా మారాడు. కేవలం వలస కూలీలకు మాత్రమే కాదు కష్టంలో ఉన్న చాలామందికి సోనూసూద్ దైవంలాగానే కనిపిస్తున్నాడు. 

వలస కూలీలను సురక్షితంగా వారి స్వస్థలాలకు పంపింటంతో బిజీగా ఉన్న నటుడు సోనూసూద్.. ఇప్పుడు మహారాష్ట్ర నిసర్గ బాధితులపై దృష్టిపెట్టారు. నిసర్గ తుఫాను ప్రభావంతో నిరాశ్రయులైన బాధితుల కోసం కూడా నేనున్నానంటూ ముందుకొచ్చారు సోనూసూద్. కష్టంలో ఉన్నవారికి మనిషి అవతారంలో వచ్చిన భగవంతుడిగా మారారు సోనూసూద్. ముంబై తీర ప్రాంతంలోని సుమారు 28 వేలమందికి ఆహారం అందించారు సోనూ. 

అంతేకాదు వారు సురక్షితంగా ఉండేందుకు తగిన చర్యలు కూడా తీసుకున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. నిసర్గ తుపాను ముంచుకు వస్తోందన్న వార్తలతో తన బృందం అప్రమత్తమైందని, తీర ప్రాంత ప్రజల ఆకలి తీర్చడంతో పాటు వారిని సురక్షిత ప్రాంతాల్లోని కాలేజీలు, స్కూల్స్ కు తరలించామని సోనూ సూద్ తెలిపారు. అలాగేఅంతేకాదు.. నిసర్గ తుపాను కారణంగా ముంబయిలో చిక్కుకుపోయిన 200 మంది అస్సామీం వలస కూలీలను షెల్టర్ కేంద్రాలకు తరలించామని చెప్పారు.

Read: పదేళ్ల వివాహ బంధం పూర్తి చేసుకున్న అనసూయ