What the Fish : వాట్ ది ఫిష్ నుంచి వెన్నెల కిశోర్ ఫస్ట్ లుక్.. వైరల్
చాలా గ్యాప్ తరువాత రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న చిత్రం ‘వాట్ ది ఫిష్’. మనం మనం బరంపురం అనేది ట్యాగ్ లైన్.

Vennela Kishore look from What The Fish
Vennela Kishore-What the Fish : చాలా గ్యాప్ తరువాత రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న చిత్రం ‘వాట్ ది ఫిష్’. ‘మనం మనం బరంపురం’ అనేది ట్యాగ్ లైన్. నూతన దర్శకుడు వరుణ్ కోరుకొండ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. 6ix సినిమాస్ బ్యానర్ మీద విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే మనోజ్ ఫస్ట్‌లుక్ ను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది.
తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలో వెన్నెల కిశోర్‌కు కు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్‌గా మారింది. ఈ పోస్టర్‌లో వెన్నెల కిశోర్ చాలా సీరియస్‌గా కనిపిస్తున్నాడు. చేతిలో ఓ పెద్ద రంపంతో కనిపిస్తుండగా, బ్యాగ్రౌండ్‌లో కరెన్సీ నోట్లు గాల్లోకి ఎగురుతున్నాయి.
మంచు మనోజ్, వెన్నెల కిశోర్ లు కాకుండా ఈ సినిమాలో ఇంకా ఎవరెవరు నటిస్తున్నారు అన్న వివరాలను చిత్ర బృందం ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే వారి వివరాలను వెల్లడించనున్నారు.
My AVATAR in #WhatTheFish ??..Thanks to @afilmbyv ?
Exploding soon on the big screens ?@afilmbyv ?@HeroManoj1 #Varun @6ixCinemas #VishalBezawada #SuryaBezawada #Shaktikanth @prosathish pic.twitter.com/XW8gy38jQj
— vennela kishore (@vennelakishore) October 16, 2023