విజయ్‌ను షూటింగ్ లొకేషన్‌కి వెళ్లి మరీ ప్రశ్నించిన ఐటీ అధికారులు
ప్రముఖ నటుడు, ‘దళపతి’ విజయ్‌ను ఐటీ అధికారులు షూటింగ్ స్పాట్‌కి వెళ్లి మరీ విచారించటం తమిళ చిత్రసీమలో హాట్ టాపిక్‌గా మారింది..

ప్రముఖ నటుడు, ‘దళపతి’ విజయ్‌ను ఐటీ అధికారులు షూటింగ్ స్పాట్‌కి వెళ్లి మరీ విచారించటం తమిళ చిత్రసీమలో హాట్ టాపిక్‌గా మారింది..
ఏజీఎస్ ప్రొడక్షన్ నిర్నించిన ఓ చిత్రానికి సంబంధించి ప్రముఖ నటుడు, దళపతి విజయ్‌ను ఐటీ అధికారులు ప్రశ్నించడం తమిళ చిత్రసీమలో హాట్ టాపిక్‌గా మారింది. ఏజీఎస్ సంస్థ ఇటీవలే విజయ్, యువ దర్శకుడు అట్లీ కలయికలో ‘బిగిల్’ చిత్రాన్ని నిర్మించింది. స్పోర్ట్స్ అండ్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడమే కాక, సుమారు రూ. 250 నుండి రూ. 300 కోట్ల మేరకు వసూళ్లు సాధించినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున మధురైలోని ఏజీఎస్ సినిమాస్ ఆస్తులు, ఏజీఎస్ నివాసాలు, ఫైనాన్షియర్ అంబు చెలియాన్ నివాసంతో పాటు కార్యాలయాలపై ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఉదయం నుండి చేసిన తనిఖీలలో పలు దస్తావేజులను పరిశీలించిన ఐటీ అధికారులు ‘బిగిల్’ చిత్రానికి సంబంధించిన ఐటీ వివరాలను సరిగ్గా చూపించలేదని నిర్ధారించింది. అంతేకాదు ఈ చిత్రంలో నటించిన నటుడు విజయ్‌ను విచారించాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలోనే నైవేలిలో జరుగుతున్న ‘మాస్టర్’ షూటింగ్ లోకేషన్‌కు వెళ్లిన ఐటీ అధికారులు విజయ్‌ను విచారించారు. ‘బిగిల్’ చిత్రంలో నటించినందుకుగాను విజయ్ తీసుకున్న పారితోషికం, ఏజీఎస్ ఐటీ రికార్డులలో తేడాలున్నట్లు తేలుస్తుంది. దీంతో విజయ్‌ను విచారించిన అధికారులు ఆయన వద్ద స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. ఐటీ అధికారులు షూటింగ్ స్పాట్‌కి వెళ్లి మరీ విజయ్‌ను విచారించటం తమిళ చిత్రసీమలో చర్చనీయాంశంగా మారింది.