Yusuf Hussein : ప్రముఖ నటుడు యూసఫ్ హుస్సేన్ ఇకలేరు

సీనియర్ బాలీవుడ్ నటుడు యూసఫ్ హుస్సేన్ కన్నుమూశారు..

Yusuf Hussein : ప్రముఖ నటుడు యూసఫ్ హుస్సేన్ ఇకలేరు

Yusuf Hussein

Updated On : October 30, 2021 / 11:54 AM IST

Yusuf Hussein: ప్రముఖ కన్నడ నటుడు, పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణవార్తను మర్చిపోకముందే మరో నటుడు మృతి చెందారనే వార్తతో సినిమా పరిశ్రమ ఉలిక్కి పడింది. సీనియర్ బాలీవుడ్ నటుడు యూసఫ్ హుస్సేన్ కన్నుమూశారు.

Puneeth Rajkumar : వయసులో చిన్న.. వ్యక్తిత్వంలో మిన్న.. తండ్రిలానే కళ్లు దానం చేసిన పునీత్ రాజ్ కుమార్..

ఆయన వయసు 73 సంవత్సరాలు. పలు హిందీ సినిమాల్లో నటించిన యూసఫ్ అనారోగ్య కారణంగా గతకొద్ది రోజులుగా ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో హుస్సేన్ మరణించినట్లు ఆయనకు అత్యంత సన్నిహితుడు, బాలీవుడ్ నిర్మాత హన్సల్ మెహతా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

Puneeth Rajkumar: జూనియర్ ఎన్టీఆర్‌తోనే కాదు.. సీనియర్ ఎన్టీఆర్‌తోనూ పునీత్‌కు అనుబంధం.. ఎలాగో తెలుసా..?

హుస్సేన్ మరణవార్త తెలియగానే పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతూ నివాళులర్పిస్తున్నారు. యూసఫ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు హన్సల్ మెహతా. ‘ధూమ్ 2’, ‘రాయిస్’ ‘రోడ్ టు సంగమ్’ వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు యూసఫ్ హుస్సేన్.