Anasuya : నాకు ఎదురైన సంఘటనలు మాత్రమే చెప్పాను.. వాటిని వక్రీకరించొద్దు.. అనసూయ ట్వీట్.. దేనికోసమో?

తాజాగా అనసూయ వేసిన మరో ట్వీట్ వైరల్ గా మారింది.

Anasuya : నాకు ఎదురైన సంఘటనలు మాత్రమే చెప్పాను.. వాటిని వక్రీకరించొద్దు.. అనసూయ ట్వీట్.. దేనికోసమో?

Anasuya Tweet goes Viral Netizens Asking Context

Updated On : February 12, 2025 / 8:12 AM IST

Anasuya : యాంకర్, నటి అనసూయ ప్రస్తుతం యాంకరింగ్ కి గ్యాప్ ఇచ్చినా సినిమాలతో మాత్రం బిజీగానే ఉంది. ఇటీవలే పుష్ప 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు, ఫ్యామిలీ ట్రిప్స్ పోస్ట్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు తను వేసే ట్వీట్స్ తో, చేసే కామెంట్స్ తో వివాదాల్లో, వార్తల్లో నిలుస్తుంది అనసూయ. తాజాగా అనసూయ వేసిన మరో ట్వీట్ వైరల్ గా మారింది.

Also Read : Find The Persons : వీళ్ళు ఎవరో తెలుసా? టాలీవుడ్ గర్వించదగ్గ స్టార్ కమెడియన్ తల్లితండ్రులు.. వీళ్ళ గురించి ఎంత గొప్పగా చెప్పారో..

అనసూయ తాజాగా తన ట్విట్టర్లో.. నేను నాకు ఎదురైన అనుభవాన్ని, నేను చూసిన సంఘటనలను మాత్రమే పంచుకున్నాను. నేను ఎవర్ని బ్లేమ్ చెయ్యట్లేదు. కానీ అవగాహన కలిపించడం కోసమే నేను మాట్లాడాను. ఆడియన్స్ కి, మీడియాకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి నా మాటలను వక్రీకరించి నేను అనని మాటలు అన్నట్టు చెప్పొద్దు. ఇలాంటివి నా క్యారెక్టర్ ని డిసైడ్ చేయలేవు. నిజమే నిలుస్తుంది. నన్ను అర్ధం చేసుకున్న వారికి మాత్రం ప్రేమను పంపిస్తాను అని పోస్ట్ చేసింది.

Also Read : Chiranjeevi : మా తాత మంచి రసికుడు.. తన తాతయ్య గురించి చిరంజీవి ఆసక్తికర కామెంట్స్..

దీంతో అనసూయ ట్వీట్ వైరల్ గా మారింది. అయితే ఈ ట్వీట్ దేని కోసం వేసింది, ఎవరి కోసం వేసింది అని చర్చ మొదలయింది. ఇటీవల అనసూయ ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలో అనేక కామెంట్స్ చేసింది. సినీ పరిశ్రమ గురించి, కాస్టింగ్ కౌచ్ గురించి, తన డ్రెస్సింగ్, ఫ్యామిలీ, రిలేషన్ షిప్.. ఇలా అనేక అంశాల గురించి మాట్లాడింది. ఈ ఇంటర్వ్యూలో తను చేసిన వ్యాఖ్యల గురించి ఎవరైనా తప్పుగా అర్ధం చేసుకొని మాట్లాడారేమో, అందుకే అనసూయ ఇలా ట్వీట్ చేసిందేమో అని భావిస్తున్నారు. కానీ అసలు కారణం మాత్రం తెలియకపోవడంతో పలువురు నెటిజన్లు అనసూయ పోస్ట్ కింద ఈ ట్వీట్ ఎందుకు అని కామెంట్స్ చేస్తున్నారు.