Bhagyashri Borse : హీరోయిన్ గా ఫస్ట్ సినిమా డిజాస్టర్.. కానీ స్టార్ హీరోలతో వరుస సినిమాలు..
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో అనుకుంటున్నారా?

Actress Bhagyashri Borse First Movie Flop but Getting Star Hero Movies Chances including Vijay Deverakonda Ram Pothineni Rana Dulquer Salman
Bhagyashri Borse : కొంతమంది హీరోయిన్స్ కి సినిమా హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా అవకాశాలు వస్తుంటాయి. వాళ్ళ అందానికో, వాళ్ళ నటనకో అవకాశాలు వెతుకుంటూ వస్తాయి. ఈ హీరోయిన్ కి అలాగే వస్తున్నాయి. హీరోయిన్ గా మొదటి సినిమా డిజాస్టర్ అయినా స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తుంది ఈ భామ.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో అనుకుంటున్నారా? టాలీవుడ్ లో రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ భోర్సే. ఆ సినిమా డిజాస్టర్ అయింది. కానీ ఆ సినిమా ప్రమోషన్స్ లో చీరల్లో రెగ్యులర్ గా కనపడి బాగా వైరల్ అయింది. మొదటి సినిమా ఫ్లాప్ అయినా ఇప్పుడు వరుస సినిమాలు చేస్తుంది.
విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీలీల డేట్స్ ఇష్యూతో ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ భాగ్యశ్రీ భోర్సేకి వచ్చింది. కింగ్డమ్ సినిమా మే 30న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా తర్వాత రామ్ పోతినేనితో సినిమా చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి భాగ్యశ్రీ భోర్సే పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. మరోవైపు రానా, దుల్కర్ సల్మాన్ కలిసి నటిస్తున్న కాంత సినిమాలో కూడా భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ మూడు సినిమాలే కాకుండా మరో టాలీవుడ్ సినిమా కూడా భాగ్యశ్రీ చేతిలో ఉన్నట్టు సమాచారం. మొదటి సినిమా పోయినా ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని దూసుకుపోతుంది భాగ్యశ్రీ భోర్సే.
Also Read : Kushitha Kallapu : బాబోయ్ బోల్డ్ లుక్స్ తో ఆహా సిరీస్ లో ‘కుషిత కళ్లపు’.. గ్లింప్స్ వైరల్..