షూటింగులో గాయపడ్డ గోవా బ్యూటీ

  • Published By: sekhar ,Published On : November 10, 2020 / 04:50 PM IST
షూటింగులో గాయపడ్డ గోవా బ్యూటీ

Updated On : November 10, 2020 / 5:12 PM IST

Ileana D’Cruz injured: హీరోయిన్‌గా ఫస్ట్ సినిమాతోనే తన సన్నని నున్నని రింగురోడ్ లాంటి నడుమొంపులతో కుర్రకారు మనసుల్ని కొల్లగొట్టిన గోవా బ్యూటీ ఇలియానా షూటింగులో గాయపడింది.


వివరాల్లోకి వెళ్తే.. ఇల్లీ బేబి ప్ర‌స్తుతం ర‌ణ్‌దీప్ హుడా హీరోగా నటిస్తున్న Unfair and Lovely లో కథానాయికగా నటిస్తోంది. తాప్సీ, భూమి ఫెడ్నేకర్ నటించిన Saand Ki Aankh మూవీకి స్క్రీన్‌ప్లే రైటర్‌గా వర్క్ చేసిన బ‌ల్వీంద‌ర్ సింగ్ జ‌నుజ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయవుతున్నారు.


కాగా ‘అన్‌ఫెయిర్ అండ్ ల‌వ్‌లీ’ షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. షూటింగులో ఇలియానా చేతికి చిన్నపాటి గాయం అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన చేతికైన గాయాన్ని చూపిస్తూ.. ‘రొమాంటిక్ కామెడీ సినిమా షూటింగులో ఎవరైనా గాయపడతారు?..’ అంటూ ఫన్నీ కామెంట్ కూడా పెట్టింది. ఇలియానా గాయపడిన విషయం తెలుసుకున్న అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.