Madhu Shalini: తమిళ యాక్టర్‌ను పెళ్లాడిన తెలుగు బ్యూటీ
యాంకర్ నుండి హీరోయిన్‌గా మారిన వారిలో నటి మధుశాలిని కూడా ఒకరు. ఆమె బుల్లితెరపై యాంకర్‌గా ఓ వెలుగు వెలిగి, ఆ తరువాత వెండితెరపై హీరోయిన్‌గా....

Actress Madhu Shalini Ties Knot With Tamil Actor
Madhu Shalini: యాంకర్ నుండి హీరోయిన్‌గా మారిన వారిలో నటి మధుశాలిని కూడా ఒకరు. ఆమె బుల్లితెరపై యాంకర్‌గా ఓ వెలుగు వెలిగి, ఆ తరువాత వెండితెరపై హీరోయిన్‌గా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకుని సక్సెస్ అయ్యింది. కితకితలు, వాడు-వీడు, గూఢచారి వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మధుశాలిని తనదైన ఇంప్రెషన్ క్రియేట్ చేసుకుంది.
ఇక ఈ బ్యూటీ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో తన అభిమానులను అందాల ఆరబోతతో అలరిస్తూ వచ్చింది. అయితే తాజాగా ఈ బ్యూటీ సైలెంట్‌గా పెళ్లి చేసుకున్నట్లుగా తెలిపింది. తమిళ నటుడు గోకుల్ ఆనంద్‌ను గతకొంత కాలంగా ప్రేమిస్తున్న మధుశాలిని తాజాగా అతడిని వివాహం చేసుకుంది. హైదరాబాద్‌లో కొందరు సన్నిహితుల మధ్య తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడింది ఈ తెలుగు బ్యూటీ.
ఇలా తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడటం తనకు ఎంతో సంతోషంగా ఉందని.. పెళ్లికి వచ్చి తమ జంటను దీవించిన వారితో పాటు.. తనకు ఎల్లప్పుడూ అండగా ఉన్న అభిమాలకు కూడా తన ధన్యవాదాలు తెలిపింది. తమ కొత్త జీవితం సుఖసంతోషాలతో సాగిపోవాలని అందరూ దీవించాలంటూ సోషల్ మీడియాలో తన పెళ్లికి సంబంధించి ఫోటోను పోస్ట్ చేసింది ఈ బ్యూటీ.
View this post on Instagram