హీరోయిన్ మియా జార్జ్ పెళ్లి చేసుకుంది!..

  • Published By: sekhar ,Published On : September 13, 2020 / 09:04 PM IST
హీరోయిన్ మియా జార్జ్ పెళ్లి చేసుకుంది!..

Updated On : September 13, 2020 / 10:14 PM IST

Actress Miya George Marries Ashwin Philip: పాపులర్ మలయాళ హీరోయిన్ మియా జార్జ్ పెళ్లి చేసుకుంది. బిజినెస్ మెన్ అశ్విన్ ఫిలిప్‌తో మియా వివాహం శనివారం కొచ్చిలో ఘనంగా జరిగింది. క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ పెళ్లికి అతికొద్దిమంది బంధువులు, సన్నిహితుల హాజరయ్యారు.



మియా హాఫ్ వైట్, హై-నెక్ స్క్వీన్డ్ గౌనులో మెరవగా, అశ్విన్ బ్లూ త్రీ పీస్ సూటులో అదిరిపోయాడు. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నూతన జంటకు సినీ పరిశ్రమవారు, ఫ్యాన్స్, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. కాగా జూన్‌లో కేరళలో వీరి నిశ్చితార్థం జరిగింది.



టీవీ నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన మియా జార్జ్ ‘అమరకావ్యం’ చిత్రంతో తమిళ పరిశ్రమకు పరిచయమైంది. తెలుగులో సునీల్ సరసన ‘ఉంగరాల రాంబాబు’ సినిమాలో నటించింది. ‘రెడ్ వైన్’, ‘మెమొరీస్’, ‘విషుధన్’, ‘మిస్టర్ ఫ్రాడ్’ వంటి సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి.
అలాగే చియాన్ విక్రమ్ ‘కోబ్రా’తో పాటు ‘కన్మణిల్ల’ అనే మలయాళ చిత్రంలోనూ నటిస్తోంది మియా జార్జ్.