అక్కడ రాధిక ఆప్టే టాటూ : ఎవరి పేరో తెలుసా?

రాధిక ఆప్టే రెడ్ కార్పెట్‌పై వయ్యారంగా నడుస్తుండగా.. అందరి చూపూ ఆమె తొడపైనున్న టాటూపై పడింది..

  • Published By: sekhar ,Published On : May 1, 2019 / 11:31 AM IST
అక్కడ రాధిక ఆప్టే టాటూ : ఎవరి పేరో తెలుసా?

Updated On : May 1, 2019 / 11:31 AM IST

రాధిక ఆప్టే రెడ్ కార్పెట్‌పై వయ్యారంగా నడుస్తుండగా.. అందరి చూపూ ఆమె తొడపైనున్న టాటూపై పడింది..

హాట్ బ్యూటీ రాధిక ఆప్టే మరోసారి వార్తల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు ఎవరికీ తెలియని సీక్రెట్ ఒకటి ఆమె బయట పెట్టడమే దానికి కారణం.. రీసెంట్‌గా కాస్మోపాలిటన్ బ్యూటీ అవార్డ్స్ 2019 వేడుక ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా రాధిక ఆప్టే రెడ్ కార్పెట్‌పై హొయలొలికిస్తూ తన బోల్డ్ లుక్ అండ్ హాట్ నెస్‌తో అందర్నీ ఆకర్షించింది. అక్కడితో ఆపితే ఆమె రాధిక ఎందుకవుతుంది? ఈ వేడుకలో రాధిక, ఫేమస్ బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన సిల్వర్ గౌను వేసుకుంది. స్పెషల్‌గా డిజైన్ చేసిన ఈ గౌనులో తన తొడ అందాలన్నీ బయట పెట్టింది. రాధిక వయ్యారంగా నడుస్తుండగా.. అందరి చూపూ తొడపైనున్న టాటూపై పడింది.

అరే, ఇన్నాళ్ళూ లేదే ఇది.. అని అందరూ నోరెళ్ళబెట్టి చూసారు. కాస్త పరీక్షగా చూస్తే, బి అనే టాటూ క్లియర్‌గా కనబడింది. బి ఏంటబ్బా అని ఆరాతీస్తే అది ఆమె భర్త పేరు.. అతగాడి పేరు బెనడిక్ట్ టేలర్.. 2012లో వీళ్లిద్దరూ రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. రాధికకి పెళ్ళైన సంగతి చాలామందికి తెలీదు కూడా. 2011లో రాధిక డ్యాన్స్ నేర్చుకోవడానికి లండన్ వెళ్ళినప్పడు టేలర్ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమ, పెళ్ళికి దారితీసింది. ఇద్దరూ కలిసి బయట కనిపించడం కూడా తక్కువే.. రాధిక తొడపై టాటూ వెనక ఇంత స్టోరీ ఉందన్నమాట.