Ranjitha : నిత్యానంద వల్ల నాశనమైన హీరోయిన్ కుటుంబం.. ఆ కథ ఏంటో తెలుసా?
సౌత్ లో 70కి పైగా సినిమాల్లో నటించిన రంజిత.. నిత్యానంద మాయలో పడి తన తల్లి మరణానికి కారణమైందని ఆమె తండ్రి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Actress Ranjitha family collapsed due to Swami Nithyananda
Ranjitha : తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేసి ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ ‘రంజిత’. ఈమె ప్రముఖ సీనియర్ నటుడు అశోక్ కుమార్ కుమార్తె. అక్కినేని నాగేశ్వరరావు వంటి అగ్ర హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న అశోక్ కుమార్.. కొన్ని కారణాల వల్ల అవకాశాలు వస్తున్న సమయంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. ఈయనకు మొత్తం ముగ్గురు ఆడపిల్లలు. అందులో రెండో అమ్మాయి.. హీరోయిన్ రంజిత. 1991 లో తెలుగు సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన రంజిత.. తమిళ భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాతో మంచి ఫేమ్ ని సంపాదించుకుంది.
ఇక తెలుగులో జగపతిబాబు మావిచిగురు సినిమాతో మంచి గుర్తింపుని తెచ్చుకుంది. అయితే ఈ భామ తెలుగులో కంటే తమిళం, మళయాళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. 2010 వరకు వెండితెర సినిమాల నుంచి బుల్లితెర సీరియల్స్ వరకు అన్నిటిలో నటిస్తూ వచ్చిన రంజిత.. ఆ తరువాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి స్వామి నిత్యానంద (Swami Nithyananda) దగ్గర సన్యాసిగా మారిపోయింది. తాజాగా రంజిత చేసిన పని వల్ల తన కుటుంబం ఎలా కుప్పకూలిపోయిందో అనే విషయాలను ఆమె తండ్రి అశోక్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
రంజిత ఇండియన్ ఆర్మీ మేజర్ ని ప్రేమించి 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకుంది. అయితే 2002 లో ఇద్దరు విభేదాలతో విడిపోయారు. వీరిద్దరూ విడిపోవడానికి కారణం స్వామి నిత్యానందే కారణమని అశోక్ కుమార్ చెప్పుకొచ్చారు. అతని దగ్గర శిష్యురాలిగా చేరిన రంజిత.. నిత్యానంద మాయలో పడి ప్రేమించిన వ్యక్తిని దూరం చేసుకుంది. దీంతో అశోక్ కుమార్ ఒకసారి కోపంతో నిత్యానంద దగ్గరకు వెళ్లి గొడవపడినట్లు కూడా వెల్లడించారు.
అతనితో రంజితకి పెళ్లి అయ్యినట్లు కూడా వార్తలు వచ్చాయని, అవి నిజమో కాదు తనకి తెలియదని, కానీ వారిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫోటోలు మాత్రం ఉన్నాయని వ్యాఖ్యానించారు. రంజిత లాగానే తన పెద్ద కూతురు కూడా నిత్యానంద మాయలో పడి భర్తకి విడాకులు ఇచ్చి అతని దగ్గరికి వెళ్లిపోయిందని, దీంతో ఇద్దరు కూతుళ్లు అతని దగ్గరకి వెళ్లడాన్ని తట్టుకోలేక ఆయన భార్య చనిపోయినట్లు పేర్కొన్నారు. నిత్యానంద వల్ల తన కుటుంబం నాశనం అయ్యిందని బాధ పడ్డారు. ప్రస్తుతం తన మూడో కూతురు దగ్గరే ఉంటున్నట్లు చెప్పుకొచ్చిన అశోక్ కుమార్.. వెళ్లిపోయిన ఇద్దరి కూతుళ్లు ఇప్పటివరకు తనకి ఫోన్ కూడా చేయలేదని చెప్పుకొచ్చారు.