Samyuktha – Konda Surekha : కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన హీరోయిన్..

అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల‌ను ప్ర‌స్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌లు టాలీవుడ్‌లో తీవ్ర దుమారాన్ని రేపాయి.

Samyuktha – Konda Surekha : కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన హీరోయిన్..

Actress Samyuktha Menon Reacts On Konda Surekha Comments

Updated On : October 3, 2024 / 2:42 PM IST

Samyuktha – Konda Surekha: అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల‌ను ప్ర‌స్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌లు టాలీవుడ్‌లో తీవ్ర దుమారాన్ని రేపాయి. చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని స్టార్ హీరోల నుంచి చిన్న న‌టీన‌టుల వ‌ర‌కు అంతా కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌డుతూ ట్వీట్లు చేస్తున్నాయి.

తాజాగా హీరోయిన్ సంయుక్త స్పందిస్తూ ట్వీట్ చేసింది. ఇత‌రుల దృష్టి ప‌డ‌టం కోసం వేరే వాళ్ల వ్య‌క్తిగ‌త జీవితాల‌పై సుల‌భంగా ఆరోప‌ణ‌లు ఎలా చేయ‌గ‌లుగుతున్నారు అని ప్ర‌శ్నించారు.

Harish Shankar – Konda Surekha : మొదలుపెట్టింది మీరే.. ముగించాల్సిన బాధ్యత మీదే.. మంత్రి కొండా సురేఖపై హరీష్ శంకర్ ట్వీట్..

‘ఇది ఆమోదయోగ్యం కాదు. చాలా ఇబ్బందికరంగా అనిపించింది. గ‌తంలో ఇలాంటివి ఎప్పుడూ జ‌ర‌గలేదు. ఎవ‌రైనా స‌రే ఇతరుల దృష్టి పడటం కోసం వేరే వాళ్ల వ్యక్తిగత జీవితాలపై సులభంగా ఆరోపణలు ఎలా చేయగలుగుతున్నారు? సినిమా వాళ్ల‌ పేర్లను ఉపయోగించి, వారి వ్యక్తిగత జీవితాలపై నిరాధారమైన ఆరోపణలు చేయడం అమర్యాదకరం. హద్దులు దాటి ఓ వ్యక్తి ఇమేజ్‌ను దెబ్బతీయడం సహించలేని చర్య. ప్రతిఒక్కరి జీవితాలను గౌరవిద్దాం. సమాజాభివృద్ధికి పాటుపాడుతూ.. బాధ్యతాయుతంగా రాజకీయ నాయకులు వ్యవహరించాలి. ఒక మహిళా మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇబ్బందికరంగా అనిపించింది.’ అని సంయుక్త ట్వీట్ చేసింది.