Sreeleela: సినిమా టికెట్లు అమ్మిన ‘ధమాకా’ బ్యూటీ!

మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ధమాకా’ డిసెంబర్ 23న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కించగా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి వైబ్స్ క్రియేట్ చేశాయి.

Sreeleela: సినిమా టికెట్లు అమ్మిన ‘ధమాకా’ బ్యూటీ!

Actress Sreeleela Sells Dhamaka Movie Tickets At A Theatre

Updated On : December 17, 2022 / 9:28 PM IST

Sreeleela: మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ధమాకా’ డిసెంబర్ 23న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కించగా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి వైబ్స్ క్రియేట్ చేశాయి.

Sreeleela: నయా పోజులతో శ్రీలీల అందాలు..!

కాగా తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ శరవేగంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నగరంలోని పలు చోట్ల చిత్ర యూనిట్ పర్యటించి అభిమానుల్లోకి తమ సినిమాను తీసుకెళ్తోంది. ఇక తాజాగా AMB సినిమాస్ థియేటర్‌లో ధమాకా హీరోయిన్ శ్రీలీల సందడి చేసింది. అక్కడ టికెట్ కౌంటర్‌లో కూర్చుని శ్రీలీల ధమాకా అడ్వాన్స్ టికెట్లు విక్రయించడంతో అభిమానులు సందడి చేశాడు. ఆమెను చూసేందుకు వారు పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు.

Sreeleela: వరుస ఆఫర్లతో భారీగా పెంచేస్తున్న శ్రీలీల

అభిమానులతో ఈ యంగ్ బ్యూటీ సెల్ఫీలు దిగుతూ, వారితో కలిసి డ్యాన్స్ చేస్తూ సందడి చేయడంతో ధమాకా చిత్రానికి ఫుల్ ప్రమోషన్స్ జరిగాయి. ఇక పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా వస్తున్న ధమాకా సినిమాలో తన పాత్ర ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని.. రవితేజతో తన కెమిస్ట్రీని వారు బాగా ఎంజాయ్ చేస్తారని శ్రీలీల పేర్కొంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, ఇప్పటికే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాను టిజి.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.