Aditi Rao Hydari – Siddharth : జరిగింది పెళ్లి కాదా? కేవలం నిశ్చితార్థమేనా? సిద్దార్థ్‌తో అదితి పోస్ట్ వైరల్..

నిన్నటి నుంచి సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి పెళ్లి చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి.

Aditi Rao Hydari – Siddharth : జరిగింది పెళ్లి కాదా? కేవలం నిశ్చితార్థమేనా? సిద్దార్థ్‌తో అదితి పోస్ట్ వైరల్..

Aditi Rao Hydari Siddharth Engaged Photo goes Viral

Updated On : March 28, 2024 / 3:42 PM IST

Aditi Rao Hydari – Siddharth : హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి గత కొంతకాలంగా కలిసి తిరుగుతున్నారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు, డేటింగ్ చేసుకుంటున్నారు అని వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిపై ఇద్దరూ ఎప్పుడూ మాట్లాడకపోయినా అవి నిజమే అన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, కలిసి తిరగడం చేస్తున్నారు. అయితే నిన్నటి నుంచి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి.

నిన్న మార్చి 27న తెలంగాణలోని వనపర్తి శ్రీరంగపురం టెంపుల్‌లో వీరి వివాహం జరిగిందని వార్తలు వచ్చాయి. కానీ ఎలాంటి ఫోటోలు, వీడియోలు లీక్ అవ్వలేదు. తాజాగా అదితిరావు హైదరి పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. అదితి, సిద్దార్థ్ లు తీసుకున్న సెల్ఫీ ఫోటోని అదితి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలో ఇద్దరూ కొత్త ఉంగరాలతో ఉన్నారు. ఈ ఫోటోని షేర్ చేస్తూ అదితి.. అతను ఓకే చెప్పాడు, ఎంగేజ్డ్ అని పోస్ట్ చేసింది.

Also Read : The Goat Life – Aadu Jeevitham : ‘ఆడు జీవితం – ది గోట్ లైఫ్’ మూవీ రివ్యూ.. ఉపాధి కోసం వెళ్లి ఎడారిలో బానిసగా మారితే..?

దీంతో ఈ జంట నిన్న కేవలం నిశ్చితార్థం చేసుకున్నారని, పెళ్లి కాదని క్లారిటీ వచ్చింది. మొత్తానికి దాదాపు మూడేళ్ళుగా సాగుతున్న ప్రేమని నేడు అధికారికంగా చెప్పేసింది అదితి. మరి ఈ జంట పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చూడాలి. ప్రస్తుతం అదితి షేర్ చేసిన ఫోటో వైరల్ అవ్వగా అభిమానులు, పలువురు నెటిజన్లు, సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.