Adivi Sesh: సెకండ్ కేస్‌ను పట్టుకొస్తున్న అడివిశేష్.. ఎప్పుడంటే?
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా ప్రొడ్యూస్ చేసిన మూవీ ‘హిట్’ గతంలో ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ హీరో విశ్వక్ సేన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా....

Adivi Sesh Hit 2nd Case Movie Locks Its Release
Adivi Sesh: నేచురల్ స్టార్ నాని నిర్మాతగా ప్రొడ్యూస్ చేసిన మూవీ ‘హిట్’ గతంలో ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ హీరో విశ్వక్ సేన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా తనదైన మార్క్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలోనూ పూర్తిగా సక్సెస్ కావడంతో ‘హిట్’ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మొదటి భాగంలోనే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
Adivi Sesh: ‘మేజర్’ అప్డేట్ ఇచ్చిన హీరో!
దీంతో ‘హిట్’ మూవీ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘హిట్ – ది సెకండ్ కేస్’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను ఇప్పటికే ప్రారంభించిన చిత్ర యూనిట్, చిత్ర రిలీజ్ డేట్‌ను కరోనా కారణంగా వాయిదా వేసుకుని, ఎట్టకేలకు జూలై 29న రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ మేరకు చిత్ర యూనిట్ తాజాగా హిట్ సెకండ్ కేస్ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో హీరోగా యంగ్ అండ్ వర్సటైల్ యాక్టర్ అడివి శేష్ నటిస్తుండటంతో, హిట్ రెండో భాగంపై అప్పుడే అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. అడివి శేష్ ఎంచుకుంటున్న సినిమా కథలు వైవిధ్యంగా ఉండటంతో, ఈసారి హిట్ సీక్వెల్ కూడా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ప్రేక్షకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Adivi Sesh : ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అడివి శేష్..
ఇక ఈ సినిమాలో KD(కృష్ణదాస్) అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో అడివి శేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. భాను చందర్, రావు రమేష్, పోసాని కృష్ణమురళి తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హిట్ తొలి పార్ట్‌ను డైరెక్ట్ చేసిన శైలేశ్ కొలను, ఈ రెండో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు. మరి జూలై 29న రిలీజ్ కాబోతున్న ‘హిట్ – ది సెకండ్ కేస్’ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Something DANGEROUS about to unfold in the HIT universe!
Get ready for spine chilling suspense on the 29th of July. #HIT2OnJuly29 #Hit2@NameisNani @KolanuSailesh @PrashantiTipirn #MeenakshiChaudhary @maniDop @Garrybh88 #JohnStewartEduri @ManishaADutt @SVR4446 pic.twitter.com/GfcAdjTj5K
— Adivi Sesh (@AdiviSesh) May 2, 2022