Dil Raju : సీఎం రేవంత్ రెడ్డిని కలిశాం.. చిరంజీవిని కూడా కలిసి.. సమస్యలను పరిష్కరించుకుంటాము..

నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్న దిల్ రాజు నేడు చిరంజీవిని కూడా కలుసుకొని..

Dil Raju : సీఎం రేవంత్ రెడ్డిని కలిశాం.. చిరంజీవిని కూడా కలిసి.. సమస్యలను పరిష్కరించుకుంటాము..

after meeting of cm revanth reddy Dil Raju team will meet with chiranjeevi today

Updated On : January 29, 2024 / 3:36 PM IST

Dil Raju : తెలుగు నిర్మాతల మండలిలోని పలువురు ప్రముఖులు.. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులను వరుసగా కలుస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ కొత్త సినిమాటోగ్రఫీ మంత్రి కోటమరెడ్డి వెంకటరెడ్డిని కలిసి సినిమా పరిశ్రమలోని పరిస్థితులు, సమస్యలను గురించి వివరించారు. ఇక నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలుసుకున్నారు. దిల్ రాజుతో పాటు పలువురు ప్రముఖులు సీఎంతో భేటీ అయ్యారు.

మొన్న సినిమాటోగ్రఫీ మంత్రికి తెలియజేసిన పరిస్థితులు, సమస్యలనే రేవంత్ రెడ్డికి కూడా తెలియజేయగా, ఆయన.. సమస్యలతో పాటు పరిష్కారాలను కూడా తెలియజేయమని నిర్మాతలను కోరారట. ఈ రెండు రోజుల్లో నిర్మాత మండలిలోని సభ్యులందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని, పరిశ్రమలోని సమస్యలు అన్నిటిని తెలుసుకొని పరిష్కరించుకునెలా చర్యలు తీసుకుంటున్నట్లు దిల్ రాజు చెప్పుకొచ్చారు.

Also read : Vijay Devarakonda : విజయ్ VD12 మూవీ పరిస్థితి ఏంటి..? నిర్మాత నాగవంశీ ఏమన్నారు..!

ఇక అలాగే పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపిక అయిన చిరంజీవిని అభినందించేందుకు నేడు కలవబోతున్నట్లు తెలియజేసారు. ఇప్పటికే ఇండస్ట్రీలోని చిన్న హీరోల నుంచి పెద్ద దర్శకనిర్మాతల వరకు చిరంజీవిని గౌరవపూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్తున్నారు. అయితే దిల్ రాజు కేవలం శుభాకాంక్షలు మాత్రమే కాకుండా, చిత్రసీమ అంతా కలిసి చిరంజీవిని అభినందించేలా ఓ గ్రాండ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు.

ఇండస్ట్రీలో ఉన్న ఇతర పెద్దలతో చరించి ఆ ఈవెంట్ డేట్ ని ప్రకటిస్తామంటూ దిల్ రాజు పేర్కొన్నారు. ఇక ఈ ఈవెంట్ లో మెగా హీరోలు అందరితో పాటు టాలీవుడ్ లోని ఇతర హీరోలు కూడా ఒకే వేదిక పై కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా చిరంజీవితో పాటు ఉన్న తోటి సీనియర్ హీరోలు.. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కూడా ఒకే వేదిక పై కనిపించవచ్చు. మరి ఈ ఈవెంట్ ఎలా జరగబోతుందో చూడాలి.