Mushtaq Khan : బాలీవుడ్ నటుడు ముస్తాక్‌ఖాన్ కిడ్నాప్.. 12 గంటలపాటు చిత్రహింసలు.. ఎలా తప్పించుకున్నాడంటే?
Mushtaq Khan : బాలీవుడ్ నటుడు ముస్తాక్ ఖాన్ వ్యాపార భాగస్వామి ప్రకారం.. కిడ్నాపర్లు ఆయన్ను 12 గంటల పాటు చిత్రహింసలకు గురి చేసి, రూ. కోటి రూపాయలు డిమాండ్ చేశారు.

After Sunil Pal, actor Mushtaq Khan reveals he was kidnapped, tortured
Mushtaq Khan : హాస్యనటుడు సునీల్ పాల్ కిడ్నాప్ తర్వాత ప్రముఖ బాలీవుడ్ నటుడు ముస్తాక్ ఖాన్ కిడ్నాప్‌కు గురయ్యారు. స్ట్రీట్ 2, వెల్‌కమ్ వంటి మూవీల్లో నటించిన ఆయన ఈవెంట్‌కు ఆహ్వానం సాకుతో పిలిపించి తనను కిడ్నాప్ చేశారు. దాదాపు కిడ్నాపర్లు తనను 12 గంటల పాటు చిత్రహింసలకు గురి చేయడంతో పాటు కోటి రూపాయలు కూడా డిమాండ్ చేశారని ఖాన్ వ్యాపార భాగస్వామి శివమ్ మీడియాకు వెల్లడించారు. సునీల్ పాల్ కిడ్నాప్ ఘటన జరిగిన కొన్ని రోజుల తరువాత, ఢిల్లీ శివార్లలోని కిడ్నాప్ చేసినట్టు పేర్కొన్నారు.
ముస్తాక్ ఖాన్ కిడ్నాప్ ఎలా జరిగిందంటే? :
మీడియా కథనాల ప్రకారం.. గత నవంబర్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి ముస్తాక్‌ను అతిథిగా ఆహ్వానించారు. ఆయన కోసం ముంబై నుంచి ఢిల్లీకి విమాన టిక్కెట్లు కూడా బుక్ అయ్యాయి. ఆ తర్వాత, బిజ్నోర్‌కు చెందిన స్కార్పియో ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. ముస్తాక్ ఖాన్ వ్యాపార భాగస్వామి శివమ్ యాదవ్ ప్రకారం.. మీరట్‌లో ఒక ఈవెంట్ కోసం ఆహ్వానం అందింది. విమాన టిక్కెట్లతో పాటు అడ్వాన్స్ మొత్తాన్ని కూడా అందుకున్నాడు. ఢిల్లీ విమానాశ్రయానికి ఖాన్ చేరుకున్నప్పుడు.. కిడ్నాపర్లు అతన్ని కారులో కూర్చోమని చెప్పి, ఢిల్లీ శివార్లకు బలవంతంగా తీసుకెళ్లారు. కిడ్నాపర్లు తనను దాదాపు 12 గంటల పాటు చిత్రహింసలకు గురి చేశారని, కిడ్నాపర్లు ముస్తాక్ కుమారుడి అకౌంట్ నుంచి దాదాపు రూ.2 లక్షలను కూడా కాజేశారని శివమ్ చెప్పాడు.
ముస్తాక్ ఖాన్ ఎలా తప్పించుకున్నాడంటే? :
నివేదిక ప్రకారం.. ముస్తాక్ ఖాన్ కిడ్నాపర్ల బిందీగా ఉన్నప్పుడు, ఉదయం ఆజాన్ విన్నాడు. సమీపంలో ఒక మసీదు ఉంటుందని గ్రహించాడు. కిడ్నాపర్ల కళ్లుగప్పి అక్కడి నుంచి పారిపోయాడు. ఇంటికి తిరిగివచ్చేందుకు అక్కడి స్థానికులు, పోలీసుల సాయం తీసుకున్నాడు. అతనికి ఏమి జరిగిందో తెలియక ముస్తాక్, ఆయన కుటుంబం దిగ్భ్రాంతికి గురైందని, అప్పటికే మస్తాక్ ఖాన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఉంటాని భావించామని, బిజ్నోర్ వెళ్లి తాను కూడా అధికారికంగా ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్టు శివమ్ తెలిపారు. తమ వద్ద విమానానికి సంబంధించిన రుజువు ఉందన్నారు. విమాన టికెట్లు, బ్యాంకు అకౌంట్లు, విమానాశ్రయం సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను కూడా గుర్తించామన్నారు. ఖాన్‌ను నిర్భందించిన ఇంటిని కూడా పోలీసు బృందం త్వరలో కచ్చితంగా కనుగొంటుంది అని శివమ్ అన్నారు.
మసీదులోని మౌలానా మొబైల్ ఫోన్ నుంచి ముస్తాక్ తన కుమారుడికి కాల్ చేశాడని, వెంటనే ముంబై నుంచి బిజ్నోర్ చేరుకోవడం సాధ్యం కాదని శివమ్ యాదవ్ చెప్పారు. అలాంటి పరిస్థితిలో, అతను విషయం గురించి ఢిల్లీ, ఘజియాబాద్ పోలీసులకు సమాచారం అందించాడు. ముస్తాక్‌ను అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. రెండు రోజుల పాటు ఏమి తినకపోవడంతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
సునీల్ పాల్ కిడ్నాప్ కేసు :
హాస్యనటుడు సునీన్ పాల్‌కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతున్నప్పుడు హరిద్వార్ హైవే నుంచి కిడ్నాప్ అయ్యాడు. కిడ్నాపర్లు అతడిని బందీగా ఉంచి రూ.20 లక్షలు డిమాండ్ చేశారు. వారికి రూ.8 లక్షలు చెల్లించడంతో పాల్‌ని విడుదల చేశారు. ముష్తాక్ ఖాన్ వ్యాపార భాగస్వామి అయిన శివమ్, ఇద్దరు ప్రముఖులు ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఖాన్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, కొంతమంది సన్నిహితులతో సంఘటన గురించి మాట్లాడారని చెప్పాడు.
Read Also : Akhanda 2 : బాలయ్య-బోయపాటి ‘అఖండ 2’ నుంచి సాలీడ్ అప్‌డేట్.. రిలీజ్ డేట్ ఫిక్స్..