Agent : కొడుకు కోసం రాబోతున్న తండ్రి.. ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా కింగ్ నాగ్..

ఏజెంట్ సినిమాను ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ తో ఫుల్ జోష్ లో ఉంది చిత్రయూనిట్. తాజాగా నేడు ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

Agent : కొడుకు కోసం రాబోతున్న తండ్రి.. ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా కింగ్ నాగ్..

Agent movie pre release event in warangal as nagarjuna chief guest

Updated On : April 23, 2023 / 1:35 PM IST

Agent :  అక్కినేని అఖిల్(Akkineni Akhil), సాక్షి వైద్య(Sakshi Vaidya) జంటగా సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో అనిల్ సుంకర(Anil Sunkara) నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఏజెంట్(Agent). మొదటి సారి అఖిల్ పూర్తిగా మాస్, యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. ఇన్నాళ్లు లవర్ బాయ్ గా అలరించిన అఖిల్ కు ఇప్పటివరకు భారీ హిట్ పడలేదు. అఖిల్ గత సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(Most Eligible Bachelor) సినిమా మాత్రం పర్వాలేదనిపించి ఓ మోస్తరు విజయం సాధించింది. మొదటి సారి అఖిల్ రేంజ్ కి మించి భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీశారు.

ఏజెంట్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై అంచనాలు పెంచారు. ఏజెంట్ సినిమాను ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ తో ఫుల్ జోష్ లో ఉంది చిత్రయూనిట్. తాజాగా నేడు ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

Anupama Parameswaran : ఎవరేం అనుకుంటారో అనే భయంతో కొన్ని పాత్రలు వదిలేశాను..

నేడు అఖిల్ ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్ లోని రంగలీలా మైదానంలో సాయంత్రం 6 గంటల నుండి గ్రాండ్ గా జరుగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా రానున్నారు. దీంతో అక్కినేని అభిమానులు భారీగా ఈ ఈవెంట్ కు హాజరు కానున్నారు. మరి ఏజెంట్ సినిమా అఖిల్ కు ఏ రేంజ్ హిట్ ఇస్తుందో చూడాలి.