Anupama Parameswaran : ఎవరేం అనుకుంటారో అనే భయంతో కొన్ని పాత్రలు వదిలేశాను..

ప్రస్తుతం అనుపమ తెలుగులో డీజే టిల్లు సినిమా సీక్వెల్ 'టిల్లు స్క్వేర్'లో నటిస్తుంది. అలాగే తమిళ్ లో ఓ సినిమా చేస్తోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను చేసే పాత్రలు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Anupama Parameswaran : ఎవరేం అనుకుంటారో అనే భయంతో కొన్ని పాత్రలు వదిలేశాను..

Anupama Parameswaran comments on her characters in movies

Updated On : April 23, 2023 / 1:02 PM IST

Anupama Parameswaran :  మలయాళంలో ప్రేమమ్ సినిమాతో, తెలుగులో అఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. అనంతరం వరుసగా మలయాళం, తెలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. గత సంవత్సరం వరుసగా నాలుగు తెలుగు సినిమాలు రిలీజ్ చేసింది. కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన అనుపమ బటర్ ఫ్లై సినిమాతో ఓటీటీలో కూడా మెప్పించింది. ఇక అంటే సుందరానికి సినిమాలో గెట్ రోల్ లో కూడా నటించి అలరించింది.

ప్రస్తుతం అనుపమ తెలుగులో డీజే టిల్లు సినిమా సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’లో నటిస్తుంది. అలాగే తమిళ్ లో ఓ సినిమా చేస్తోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను చేసే పాత్రలు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Sudigali Sudheer : ప్రభాస్‌ దర్శకుడితో సుడిగాలి సుధీర్‌ సినిమా.. నిజమేనా?

అనుపమ మాట్లాడుతూ.. 2021 వరకు పాత్రల ఎంపికపై నేనొక గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాను. ఆ సమయంలో ‘ఫ్రీడమ్‌ @ మిడ్‌నైట్‌’ అనే ఓ షార్ట్ ఫిలిం చేశాను. ఆ సినిమాను అందరూ ఆదరించారు. ఆ సినిమా నాకు ధైర్యాన్ని ఇచ్చింది. నాలో ఉన్న చాలా భయాలు, అపోహలను పోగొట్టింది. కొన్ని పాత్రలు చేస్తే జనాలు, ప్రేక్షకులు, అభిమానులు ఏమనుకుంటారో అనుకునేదాన్ని. అలాంటి భయంతోనే చాలా పాత్రలు వదులుకున్నాను. కానీ ఆ సినిమా తర్వాత ప్రేక్షకులు మనం చేసే పాత్ర నచ్చితే ఆదరిస్తారు అనే నమ్మకం కలిగింది. ఇకపై ప్రతి సినిమాకి ప్రతి కొత్త పాత్రతో రావాలని, నాకు నచ్చిన పాత్రలు చేయాలని అనుకున్నాను. ఒక చిన్న సీన్ అయినా సరే నాకు నచ్చితే చేయడానికి నేను రెడీ. అలాగే అన్ని భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని తెలిపింది.