Aha : సరికొత్త సిరీస్ అనౌన్స్ చేసిన ఆహా.. ఎప్పటినుంచి అంటే..

Aha announced the new series Chiranjeeva
Aha : ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, టాక్ షోలు, సిరీస్ లు వస్తూ ఉంటాయి. ఇప్పటికే ఇందులో నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే అర్థమైందా అరుణ్ కుమార్ సిరీస్ కూడా ఈ రోజు నుండి స్ట్రీమింగ్ కానుంది. అయితే త్వరలో ఆహా మరో కొత్త సిరీస్ ప్రారంభించబోతుంది. దీనికి సంబందించిన అధికారిక అప్డేట్ కూడా ఇచ్చారు.
Also Read : Malaika Arora : బ్రేకప్ వార్తలపై స్పందించిన మలైకా అరోరా.. ఏం చెప్పిందంటే..
ఇక ఆ సిరీస్ పేరు ‘చిరంజీవ’. ఈ మైథలాజికల్ సిరీస్ డిసెంబర్ 2024 నుండి ఆహాలో అందుబాటులోకి వస్తుంది. ఈ సిరీస్ లో పురాణాల ప్రపంచం ఎలా ఉంటుందన్నదాన్ని చూపిస్తారట. అంతేకాదు చిరంజీవ సిరీస్ వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సువారిని ఆకట్టుకుంటుందట.
కంటెంట్ తో పాటు మంచి విజువల్స్ తో ‘చిరంజీవ’ సిరీస్ ఉంటుందట. దీనికి సంబందించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే షేర్ చేస్తారట. అభినయ కృష్ణ రచన, దర్శకత్వంలో వస్తున్న ఈ సిరీస్ ను ఏ రాహుల్ యాదవ్, సుహాసిని యాదవ్ నిర్మిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతంతో వస్తున్న ఈ సిరీస్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.