Chiranjeeva : పక్కా ఇండియన్ స్టైల్ లో చిరంజీవ.. హీరో ఎవరంటే..
ప్రముఖ ఆహా ఓటీటీ సంస్థ సరికొత్త కథలను తీసుకొస్తూ ఉంటుంది.

aha Chiranjeeva web series teaser update
Chiranjeeva : ప్రముఖ ఆహా ఓటీటీ సంస్థ సరికొత్త కథలను తీసుకొస్తూ ఉంటుంది. సరికొత్త టాలెంట్ ను పరిచయం చేస్తుంది. తాజాగా ఇప్పుడు మరో సరికొత్త సినిమా తీసుకొస్తుంది. చిరంజీవ పేరుతో ఈ సినిమా రాబోతుంది. మైథలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్ త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఇటీవల దీనికి సంబందించిన లుక్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్.
Also Read : Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొత్త యాడ్ చూసారా..
జబర్దస్త్ పాపులర్ కమెడియన్ అభినయ కృష్ణ ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఈ సిరీస్ లో హీరో ఎవరన్నది రివీల్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు ఆహా టీమ్. ఇక వీడియోలో డైరెక్టర్ అభినయ కృష్ణ టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తో కలిసి కూర్చొని.. ఇదొక సూపర్ హీరో కథ అని..పక్కా ఇండియన్ స్టైల్ లో ఈ కథ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించని కాన్సెప్ట్ తో ఇది ఉంటుందని తెలిపాడు. త్వరలోనే దీనికి సంబందించిన టీజర్ రాబోతుందని చెప్పాడు అభినయ కృష్ణ. కాగా ఈ సినిమా జనవరిలో రానుంది.
View this post on Instagram
దీంతో ఈ సినిమాలో రాజ్ తరుణ్ నటిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఇటీవల రాజ్ త్తరుం ఓ అమ్మాయి వివాదంలో వైరల్ అయినా సంగతి తెలిసిందే. ఆ వివాదం జరుగుతున్నప్పుడే రెండు సినిమాలు వచ్చాయి. వివాదం తర్వాత రాజ్ తరుణ్ చిరంజీవ సినిమాతో త్వరలో రాబోతున్నాడు.