RRR Movie: ఆర్ఆర్ఆర్ బర్త్‌డే సర్‌ప్రైజ్.. అజయ్ దేవగన్ వీడియో!

ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ అజయ్ దేవగన్ పుట్టినరోజు సంధర్భంగా సర్‌ప్రైజ్ వీడియో విడుదల చేసింది. 

RRR Movie: ఆర్ఆర్ఆర్ బర్త్‌డే సర్‌ప్రైజ్.. అజయ్ దేవగన్ వీడియో!

Ajay Devgn Motion Poster From Rrr Movie

Updated On : April 2, 2021 / 12:44 PM IST

ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ అజయ్ దేవగన్ పుట్టినరోజు సంధర్భంగా సర్‌ప్రైజ్ వీడియో విడుదల చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో అజయ్ పాత్రను తెలియజెప్పే ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను చిత్రయూనిట్ లేటెస్ట్‌గా విడుదల చేసింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అజయ్‌ దేవ్‌గణ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతూ ఉండగా.. ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. సినిమాపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా తారక్‌ కనిపించిన వీడియోలను చిత్రయూనిట్ విడుదల చేసింది.

సినిమాపై అంచనాలు తగ్గకుండా చిత్రీకరిస్తున్నట్లుగా ఇప్పటికే అర్థం అవుతుండగా.. అజయ్ లుక్‌‌తో ప్రతీ పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుంది అనేది అర్థం అవుతోంది. మోషన్ పోస్టర్‌తో అంచనాలను పెంచేయగా.. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌ కథానాయికలు.