ఆర్‌ఆర్‌ఆర్‌ లో అజయ్ దేవ్ గన్ పాత్ర ఏంటో తెలుసా?

  • Published By: bheemraj ,Published On : June 25, 2020 / 06:30 PM IST
ఆర్‌ఆర్‌ఆర్‌ లో అజయ్ దేవ్ గన్ పాత్ర ఏంటో తెలుసా?

Updated On : June 25, 2020 / 6:30 PM IST

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ (రణం రౌద్రం రుధిరం). రాంచరణ్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో వస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్‌, హాలీవుడ్‌ తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్‌ తారలు అజయ్‌దేవ్‌గన్‌, అలియా భట్‌ నటిస్తున్నారు. 

తాజాగా అజయ్‌దేవ్‌గన్‌ పాత్రకు సంబంధించిన వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు, కొమ్రం భీమ్‌ కు అజయ్‌దేవ్‌గన్‌ మెంటర్‌గా వ్యవహరిస్తారట. ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌లో కీలకంగా ఉండే పాత్రలో అజయ్‌ కనిపించనున్నాడట.

రామోజీఫిలిం సిటీలో వేసిన 1900 బ్యాక్‌డ్రాప్‌ ఢిల్లీ సెట్స్‌లో ఇప్పటికే అజయ్‌ 10 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అల్లూరి, కొమ్రంభీంకు విలువిద్య నేర్పించే వ్యక్తిగా కనిపించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. షూటింగ్‌ మొదలవగానే అజయ్‌దేవ్‌గన్‌ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేయాలని చూస్తున్నట్లు సమాచారం.