Akhanda: డిసెంబర్‌లోనే గర్జన.. త్వరలో అధికారిక ప్రకటన?

బాలయ్య సినిమా ఎప్పుడెప్పుడా అని నందమూరి అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా హ్యాట్రిక్ సినిమా అఖండ..

Akhanda: డిసెంబర్‌లోనే గర్జన.. త్వరలో అధికారిక ప్రకటన?

Akhanda

Updated On : November 12, 2021 / 4:21 PM IST

Akhanda: బాలయ్య సినిమా ఎప్పుడెప్పుడా అని నందమూరి అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా హ్యాట్రిక్ సినిమా అఖండ షూటింగ్ పూర్తిచేసుకుంది. సరైన సమయం చూసి గర్జించేందుకు సిద్ధమైంది. అఖండ విడుదల తేదీలపై కూడా చాలాకాలంగా వాయిదాలు పడుతూనే ఉంది. ముందుగా ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్న షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదాలు పడుతూ వచ్చింది.

Pushpaka Vimanam: తమ్ముడి కోసం రౌడీ ఆరాటం.. పుష్పక విమానంతో తీరేనా?

ఇక, షూటింగ్ పూర్తయ్యాక కూడా సరైన సమయం దొరక్క మళ్ళీ వాయిదాలు పడుతూ వస్తుంది. ముందుగా దసరాకి ఈ సినిమా వస్తుందనుకున్నారు. ఆ తర్వాత దసరాకి రాలేని అఖండను దీపావళి రేస్ లో తీసుకురావాలని మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నట్లుగా వినిపించింది. ఏమైందో ఏమో ఆ రెండు పండగలకు అఖండ నుండి ఎలాంటి సందడి లేదు. ఇక, ఇప్పుడు ఎప్పుడెప్పుడు సినిమా తెరమీదకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

RRR: యూట్యూబ్‌కి కూడా అందని మన హీరోల ‘నాటు’ డాన్స్ స్పీడ్!

అఖండ విడుదలపై అధికారికంగా రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చెయ్యకపోయినా అనధికారికంగా కొన్ని డేట్స్ వినిపిస్తున్నాయి.
దాదాపుగా ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల అవుతుందని.. మేకర్స్ ఇప్పటికే ఈ డేట్ కోసం సన్నాహాలు చేస్తున్నారని చెప్తున్నారు. దీనిపై అధికారిక క్లారిటీ కూడా త్వరలోనే ఇవ్వనున్న యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ముమ్మరంగా చేపట్టేందుకు సిద్దమైందట. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

RRR: బామ్మ ‘నాటు’ డాన్స్.. కేకో కేక..!

అందుకు తగ్గట్లే అఖండ నుండి వదిలిన పోస్టర్లు, టీజర్లు సినిమా మీద మరింత హైప్ పెంచేశాయి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్యకు జోడిగా ప్రగ్యాజైస్వాల్ నటిస్తున్న ఈ సినిమా సినిమా రిలీజ్ ఎప్పుడు ఉండనుంది.. ట్రైలర్స్ విడుదల ఎప్పుడన్నది మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.