Agent : అఖిల్ ఫ్యాన్స్‌తో ఏజెంట్ నిర్మాత చిట్ చాట్.. కావాలనే అఖిల్‌ని టార్గెట్ చేస్తున్నారు!
అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమాతో ఈ నెల 28న ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ చిత్ర నిర్మాత ట్విట్టర్ లో అభిమానులతో మాట్లాడుతూ..

Akhil Akkineni Agent producer says trailer is coming
Agent : అక్కినేని హీరో అఖిల్ (Akhil Akkineni) నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీని AK ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకం పై అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 28న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. విడుదల దగ్గర పడుతున్నా ఇప్పటివరకు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. దీంతో అక్కినేని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నిర్మాత అనిల్ సుంకర ట్విట్టర్ లో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు.
Agent Movie: అయ్యగారు రెండు అప్డేట్స్ పట్టుకొస్తున్నారు.. ఏమిటంటే?
ఏజెంట్ ఫైనల్ కట్ ట్రైలర్ చూసినట్లు, అది అందరి అంచనాలు మించి ఉంది అంటూ తెలియజేశాడు. అలాగే అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చాడు. ఈ క్రమంలోనే ఒక అభిమాని.. ప్రమోషన్స్ చాలా దారుణంగా చేస్తున్నారు అంటూ కామెంట్ చేశాడు. దీనికి నిర్మాత బదులిస్తూ.. నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఒక వారం తరువాత నువ్వు ఈ కామెంట్ వెనక్కి తీసుకుంటావు అంటూ పేర్కొన్నాడు. అలాగే మరొక అభిమాని.. ‘సార్ కొన్ని వెబ్ సైట్స్ లో కావాలనే ఏజెంట్ మూవీని, అఖిల్ ని టార్గెట్ చేస్తూ ఆర్టికల్స్ రాస్తున్నారు. వాటిని ఆపడానికి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా?’ అని ప్రశ్నించాడు.
Agent Movie: రామకృష్ణా అంటూ బ్రేకప్ సాంగ్‌తో వస్తున్న ఏజెంట్
దీనికి అనిల్ సుంకర.. “ఎవరి టార్గెట్ ఏమి ఉన్న సరే మన టార్గెట్ ఏప్రిల్ 28. సినిమా చుసిన తరువాత వాళ్లే ఆర్టికల్స్ మారుస్తారు” అంటూ బదులిచ్చాడు. అయితే ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అన్నది తెలియజేయలేదు. కాగా ఈ సినిమాకి వక్కంతం వంశి కథని అందిస్తున్నాడు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నాడు.
Sir, so many negative articles from websites, kavalane agent movie ni akhil ni target chestunnaru… any plans to stop this??
— @nudeep (@anusri143) April 14, 2023