Akhil Akkineni : ‘సలార్’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో అఖిల్.. చేతికి ఏమైంది..? అంతపెద్ద గాయం ఎలా..?
'సలార్' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో అఖిల్ ఎందుకు ఉన్నారు. అసలు అఖిల్ చేతికి ఏమైంది..? అంతపెద్ద గాయం ఎలా జరిగింది..?

Akhil Akkineni appear at Prabhas Salaar success celebrations with hand fracture
Akhil Akkineni : అక్కినేని హీరో అఖిల్ ‘ఏజెంట్’ ప్లాప్ తరువాత మరో సినిమా ప్రకటించలేదు. కొత్త మూవీ అనౌన్స్ చేయకపోవడం పక్కన పెడితే.. అఖిల్ ఇంకా ఏజెంట్ లుక్ లోనే ఉండడం విశేషం. ఇటీవల ఏఎన్నార్ శతదినోత్సవం వేడుకలో ఏజెంట్ లుక్ లో అఖిల్ కనిపించడంతో.. ఎందుకని అఖిల్ ఇంకా అదే లుక్ ని మెయిన్‌టైన్ చేస్తున్నాడని అందరూ ఆలోచించడం మొదలు పెట్టారు. ఇది ఇలా ఉంటే, ఇప్పుడు మరో ప్రశ్న ఎదురైంది.
ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘సలార్’ ఇటీవల రిలీజయ్యి భారీ సక్సెస్ ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ని బెంగళూరులో నిర్వహించింది. ఈ ఈవెంట్ కి సలార్ మూవీ టీం అంతా హాజరయ్యి సందడి చేసింది. అయితే ఈ ఈవెంట్ లో అక్కినేని అఖిల్ కనిపించడం అందరిని షాక్ చేస్తుంది. అసలు అఖిల్ ఈ ఈవెంట్ లో ఎందుకని కనిపించారంటూ ప్రశ్నలు వేస్తున్నారు.
Also read : Hanuman Collections : 100 కోట్ల క్లబ్‌లోకి ‘హనుమాన్’.. అమెరికాలో, నార్త్‌లో దుమ్ము దులిపేస్తూ..
ఒకవేళ సలార్ పార్ట్ 2లో అఖిల్ ఏమైనా నటిస్తున్నారా..? అని మరికొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, ఆ వీడియోలో అఖిల్ చేతికి గాయంతో కనిపించారు. అఖిల్ ఎడమ చేతికి పెద్ద గాయం అయ్యినట్లు కనిపిస్తుంది. చేతికి సిమెంట్ కట్టు కలిగి ఉంది. ఇక ఇది చూసిన అక్కినేని ఫ్యాన్స్.. అసలు అఖిల్‌కి ఏమైంది..? అని ఆందోళన చెందుతున్నారు.
కాగా అఖిల్.. ప్రభాస్ నిర్మాత సంస్థ యూవీ క్రియేషన్స్ లో ఓ సినిమా చేస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ కూడా ఈ సినిమాకి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారంటూ కామెంట్స్ వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ అఫీషియల్ అప్డేట్ రాలేదు. ఒకవేళ ఆ మూవీని అనౌన్స్ చేయకుండా సైలెంట్ గా షూటింగ్ జరిపించేస్తున్నారా..? ఆ చిత్రీకరణలోనే అఖిల్ కి గాయం జరిగిందా..? అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. మరి అసలు వార్త ఏంటో తెలియాలంటే వేచి చూడాల్సిందే.