అకీరా నందన్, గౌతంకృష్ణ.. ఒకేసారి ఒకే సినిమాలో తెరగేట్రం చేయబోతున్నారా?
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కుమారుడు అకీరా నందన్, మహేశ్‌బాబు కుమారుడు గౌతంకృష్ణ సినీరంగ ప్రవేశంపై టాలీవుడ్‌లో తెగ ప్రచారమవుతోంది.

Akira Nandan: టాలీవుడ్‌లో ఎందరో వారసులొచ్చారు. కాకపోతే ఈ సారి ఇద్దరు క్రేజీ హీరోల వారసులు తెరగేట్రంపై జరుగుతున్న ప్రచారం హైప్ సృష్టిస్తోంది. ఆ ఇద్దరు ఒకేసారి ఒకే సినిమాలో తెరగేట్రం చేయబోతున్నారని. టాలీవుడ్‌లోనే టాప్ హీరోలైన తమ తండ్రులను మించిన సక్సెస్ సాధించేందుకు తొలి ప్రయత్నంలోనే మల్టీస్టారర్ మూవీని ఎంచుకున్నారని అంటున్నారు. ఇప్పటికే కథా చర్చలు జరుగుతున్నాయని.. సెట్స్‌పైకి రావడమే ఆలస్యమని అంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంత? మల్టీస్టారర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ ఇద్దరు వారసులు ఎవరు?
టాలీవుడ్ టాప్ హీరోల్లో పవర్‌స్టార్ పవన్ ఒకరైతే.. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మరొకరు. ఈ ఇద్దరూ ఇప్పటికీ సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఐతే వీరి వారసులు కూడా తెరగేట్రం చేయడానికి ఉత్సాహంగా ఉన్నారట. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కుమారుడు అకీరా నందన్, మహేశ్‌బాబు కుమారుడు గౌతంకృష్ణ సినీరంగ ప్రవేశంపై టాలీవుడ్‌లో తెగ ప్రచారమవుతోంది. సినీ రంగానికి చెందిన ఏ ఇద్దరు ప్రముఖులు కలుసుకున్నా ఈ ఇద్దరు టాప్ కిడ్స్ ఎంట్రీపైనే చర్చించుకుంటున్నారు.
ఈ ఇద్దరినీ ఒకే మూవీలో పరిచయం చేస్తారనే టాక్ అభిమానుల్లో క్రేజ్ పెంచుతోంది. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఇప్పటికే డిగ్రీ పూర్తి చేశాడు. తన గ్రాడ్యుయేట్ ఫంక్షన్‌లో తన సంగీత ప్రతిభను చాటాడు. ఇక మహేశ్‌బాబు కొడుకు గౌతమ్‌కృష్ణ యాక్టింగ్ స్కిల్స్‌పై శిక్షణ కూడా తీసుకున్నాడంటున్నారు. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో అకీరా సినిమాపై ఇన్నాళ్లు ముందడుగు పడలేదని.. ఇప్పుడు ఏపీ ఎన్నికలు ముగియడంతో అకీరా సినిమాపై చర్చలు మొదలయ్యాయని టాక్ వినిపిస్తోంది.
అకీరా నందన్, గౌతమ్ కృష్ణ కలిసి మల్టీస్టారర్‌గా చిత్రం చేస్తే.. తెలుగు సినిమా మరో రేంజ్‌కు వెళుతుందంటున్నారు సినీ ప్రియులు. ఇప్పటికే మన సినిమా అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటోంది. గతంలో సింగిల్ హీరో సినిమాలకే ప్రాధాన్యమిచ్చిన మన ఇండస్ట్రీ ఇటీవల మల్టీస్టారర్ మూవీలకు జైకొడుతోంది.
Also Read : అఫీషియల్.. కార్తికేయ ‘భజే వాయు వేగం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
దీంతో పవన్, మహేశ్‌బాబు కొడుకులను మల్టీస్టారర్‌గానే పరిచయం చేయాలని చూస్తున్నారట. ఈ సినిమా షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ప్రస్తుతానికి టాప్ సీక్రెట్ అంటున్నారు. ఏదిఏమైనా అకీరా నందన్, గౌతమ్‌కృష్ణ ఎంట్రీకి అంతా రెడీ అయినట్లేననేదే ఇప్పుడు ఇండస్ట్రీని కుదిపేస్తున్న హాట్ టాపిక్.