Lenin First Review : ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. ఆ ఒక్కటీ వర్కవుట్ అయితే.. అయ్యగారి ఖాతాలో సూపర్ హిట్టే..!
నాగవంశీ, నాగార్జున, మూవీ టీమ్.. అంతా ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. (Lenin First Review)
Lenin First Review
Lenin First Review : అక్కినేని అఖిల్ ఎంత కష్టపడి సినిమాలు తీసినా ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ హిట్ కొట్టలేదు. దీంతో అందరి ఆశలు లెనిన్ పైనే ఉన్నాయి. అఖిల్ తో పాటు నిర్మాత నాగవంశీ, హీరోయిన్ భాగ్యశ్రీ, దర్శకుడు మురళి కిషోర్ అందరికి ఈ సినిమా హిట్ అవ్వడం ఇంపార్టెంట్.
సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై నాగార్జున, నాగవంశీ నిర్మాణంలో మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్, భాగ్యశ్రీ జంటగా లెనిన్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా జులై 10న రిలీజ్ కానుంది. ఇప్పటికే మూవీని ఇండస్ట్రీలో చాలా మందికి చూపించారు. నాగవంశీ, నాగార్జున, మూవీ టీమ్.. అంతా ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
Also Read : Toxic : ‘టాక్సిక్’ రెమ్యునరేషన్స్ కే వంద కోట్లు పోతున్నాయిగా.. ఎవరికి ఎంత?
లెనిన్ సినిమా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో మొదలవుతుందట. ఓ ఊరి గురించి ఎన్టీఆర్ వాయిస్ ఉంటుందని తెలుస్తుంది. కథ అంతా చిత్తూరు దగ్గర్లో ఉండే శ్రీరామపురం అనే గ్రామం, ఆ గ్రామంలో జరిగే జాతర, ఆ ఊర్లో అధికారం కోసం సాగే యాక్షన్ కథగా ఉండబోతుంది. అఖిల్ ఇంట్రో, దాంతో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లు అదిరిపోతాయట. ఇక హీరోయిన్ ఇంట్రో సరికొత్తగా సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ తో నాటకాల మధ్యలో ఉండనుందట.
అఖిల్- భాగ్యశ్రీ లవ్ స్టోరీ ట్రాక్ బాగుందట. వీళ్లిద్దరి మధ్య మంచి రొమాన్స్, లవ్ ట్రాక్, సాంగ్స్ బాగుంటాయట. ఆ ఊరి కోసం, అక్కడి మనుషుల కోసం హీరో నిలబడటంతో విలన్స్ నుంచి గొడవలు, యాక్షన్ సీక్వెన్స్ లు వస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ తో పాటు క్లైమాక్స్ లో ఆసక్తికర ట్విస్ట్ లు ఉన్నట్టు తెలుస్తుంది. నమ్మినవాళ్ళే అఖిల్ ని మోసం చేసే పాత్రలు ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే ఓ రెండు పాత్రలు చనిపోతాయని, హీరో రివెంజ్ మోడ్ లోకి మారతాడని తెలుస్తుంది.
Also Read : Nandini Reddy : ఈ దెబ్బతో బాలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్న నందినిరెడ్డి.. సమంత భర్త సాయంతో..?
పల్లెటూళ్ళో జరిగే యాక్షన్ డ్రామాగా లెనిన్ ఉండబోతుంది. అఖిల్ మొదటిసారి ఊరి కుర్రాడిగా మాస్ లుక్స్ లో కనిపించి యాక్షన్స్ తో అదరగొట్టాడని తెలుస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ లు వర్కౌట్ అయితే ఈ సినిమా మంచి విజయం సాధించి అఖిల్ కి హిట్ లభిస్తుందని అంటున్నారు. మరి అక్కినేని అభిమానులను, టాలీవుడ్ ప్రేక్షకులను లెనిన్ సినిమా ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. రేపు ఉదయం 5 గంటల నుంచే తెలుగు రాష్ట్రాల్లో లెనిన్ షోలు పడనున్నాయి.
