Amala Akkineni : కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అమల ఫైర్.. పోస్టు వైరల్..!

Amala Akkineni : మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అమల కూడా స్పందించారు. మంత్రి సురేఖ వ్యాఖ్యలను విని షాకింగ్ గురయ్యానని అన్నారు.

Amala Akkineni : కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అమల ఫైర్.. పోస్టు వైరల్..!

Akkineni Amala Reaction on Minister Konda Surekha Comments

Updated On : October 2, 2024 / 10:46 PM IST

Amala Akkineni : అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల ఇష్యూపై మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ కారణంగానే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ నుంచి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే, కొండా సురేఖ వ్యాఖ్యలను నాగార్జున, నాగచైతన్య, సమంత సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఖండించారు.

రాజకీయ వివాదాల్లోకి మమ్మల్ని లాగొద్దు :
తాజాగా కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అమల కూడా స్పందించారు. మంత్రి సురేఖ వ్యాఖ్యలను విని షాకింగ్ గురయ్యానని అన్నారు. ఒక మంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమని ఆమె పేర్కొన్నారు. రాజకీయ వివాదాల్లోకి తమ కుటుంబాన్ని లాగవద్దని అమల అన్నారు.

Read Also : Nagarjuna : కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై నాగార్జున రియాక్ష‌న్‌.. మా కుటుంబం పట్ల..

తన భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటుగా పేర్కొన్నారు. రాజకీయ నాయకులే నేరస్థుల్లా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పేలా రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలి’ అని అమల అక్కినేని ఇన్‌స్టా వేదికగా పోస్టు చేశారు.

నా కుటుంబానికి క్షమాపణలు చెప్పాలి :
‘‘ఒక మహిళా మంత్రి అయి ఉండి కల్పిత ఆరోపణలతో కొందరిని లక్ష్యంగా మాట్లాడటం దిగ్భ్రాంతికరం. నా భర్త గురించి తప్పుడు కథనాలు చెబుతున్న ఇలాంటివారిని నమ్ముతున్నారా? నిజంగా సిగ్గుచేటు. రాజకీయ నేతలే ఇలా దిగజారి ప్రవర్తిస్తే మన దేశం ఏమవుతుంది?

రాహుల్ గాంధీ.. మీరు వ్యక్తుల గౌరవమర్యాదలను నమ్మితే దయచేసి మీ రాజకీయ నేతలను అదుపులో ఉంచుకోండి. మహిళా మంత్రి నా కుటుంబానికి క్షమాపణలు చెప్పాలి. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోండి. ఈ దేశ పౌరులను రక్షించండి’’ అంటూ అమల పోస్టులో పేర్కొన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Amala Akkineni (@akkineniamala)

అంతకుముందు కొండా సురేఖ వ్యాఖ్యలను నాగార్జున తీవ్రంగా ఖండించగా.. నాగచైతన్య కూడా తండ్రి ట్వీట్‏ను రీట్వీట్ చేస్తూ అసహనం వ్యక్తం చేశారు. నా విడాకులు వ్యక్తిగత విషయమని, దానిపై ఊహాగానాలు చేయడం మానుకోవాలని సమంత సూచించారు. విడాకులు పరస్పర అంగీకారంతోనే జరిగాయని, ఎలాంటి రాజకీయ కుట్ర ప్రమేయం లేదని సమంత క్లారిటీ ఇచ్చింది.

Read Also : Samantha : కొండా సురేఖ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సమంత.. నా విడాకులకు, పాలిటిక్స్ కి సంబంధం లేదు..