Bachchhan Paandey Trailer: ఒంటికన్నుతో అక్షయ్ అరాచకం.. కామెడీ విత్ యాక్షన్!

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా 'బచ్చన్ పాండే'. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, అర్షద్ వర్సి..

Bachchhan Paandey Trailer: ఒంటికన్నుతో అక్షయ్ అరాచకం.. కామెడీ విత్ యాక్షన్!

Bachchhan Paandey Trailer

Updated On : February 18, 2022 / 9:22 PM IST

Bachchhan Paandey Trailer: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘బచ్చన్ పాండే’. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, అర్షద్ వర్సి ప్రధాన పాత్రల్లో నటించారు. నడియాద్వాల గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన తమిళ హిట్ సినిమా ‘జిగర్తాండ’కు ఇది రీమేక్ కాగా ఇదే కథతో తెలుగులో వరుణ్‌ తేజ్‌ హీరోగా ‘గద్దల కొండ గణేష్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

Release Clash: పవన్ కటౌట్ చూసి కూడా వెనకాడని శర్వా.. స్ట్రాటజీ ఏంటి?

ఒరిజినల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాగా తెలుగులో గడ్డలకొండ గణేష్ ఆశించిన స్థాయిలో విజయం కాలేదు. అయితే.. అక్షయ్ హీరో కావడం.. జాక్వెలిన్, కృతి సనన్, అర్షద్ వర్షి లాంటి భారీ స్టార్ క్యాస్టింగ్ ఉండడంతో బాలీవుడ్ లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వచ్చే నెల18న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. కృతి సనన్ ఎంట్రీతో ట్రైలర్‌ మొదలు కాగా ‘బచ్చన్ పాండే ఎవరో తెలుసా.. అతడు ఓ కిల్లర్’, ‘నేను రావణుడిని.. దిళ్లు, దిమాక్ రెండు ఉన్నాయి’, ‘ఇది మె మె మె మెరిండా.. ఇది మ మ మ మాజా’ ‘చంపుతుంటే మస్త్ మజా వస్తది’ అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

Kavya Thapar: తప్పతాగి యాక్సిడెంట్.. ముంబైలో టాలీవుడ్ హీరోయిన్ అరెస్ట్!

బచ్చన్ పాండే సినిమా ట్రైలర్‌లో అక్షయ్ కుమార్ ఒంటి కన్నుతో క్రూరంగా కనిపించగా.. కామెడీ, యాక్షన్ సీన్లలో బాగా నటించాడు. మరోవైపు అక్షయ్ పక్కన ఉండే గ్యాంగ్ కామెడి చేశారు. మొత్తానికి కామెడి ప్లస్ యాక్షన్ కలగలిపిన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.