ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: హీరో క్లారిటీ

ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ స్పష్టం చేశారు. అక్షయ్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ గతకొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి అక్షయ్ ఫుల్‌స్టాప్ పెట్టారు. ఇప్పటికే పలుసార్లు మోడీ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడిన అక్షయ్ కుమార్.. ఆ పార్టీలో చేరుతారంటూ వార్తలు వచ్చినా ఎప్పుడూ ఆ వార్తలను ఖండించలేదు. ఈ క్రమంలో తాజాగా కొత్తగా ఉంది. గతంలో ఎప్పుడూ చేయలేదు. అంటూ ఓ ట్వీట్ చేయగా అది తను ఎన్నికల్లో పోటీ చేయబోయే అంశం గురించే అని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు ప్రముఖంగా మీడియాలో రావడంతో అక్షయ్ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. నా గత ట్వీట్ గురించి వస్తున్న వార్తలు గమననించాను. అయితే నేను ఎన్నికల్లో పోటీచేయడం లేదు. తనపై చూపుతున్న ప్రేమకు ధన్యవాదాలు అని తెలిపారు.
Grateful for all the interest shown in my previous tweet but just clarifying in light of some wild speculation, I am not contesting elections.
— Akshay Kumar (@akshaykumar) April 22, 2019