అక్షయ్ విరాళం : బాధిత కుటుంబాల్లో ఆనందం..

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ బీహార్ వరద బాధితులకు కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున 25 బాధిత కుటుంబాలకు సాయం అందించనున్నారు..

  • Published By: sekhar ,Published On : October 29, 2019 / 09:56 AM IST
అక్షయ్ విరాళం : బాధిత కుటుంబాల్లో ఆనందం..

Updated On : October 29, 2019 / 9:56 AM IST

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ బీహార్ వరద బాధితులకు కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున 25 బాధిత కుటుంబాలకు సాయం అందించనున్నారు..

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోమారు రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇప్పటికే పలుమార్లు తన దాతృత్వాన్ని చాటుకున్న అక్షయ్..     బీహార్ వరద బాధితులకు తన వంతు సహాయం అందించారు.. కొంతకాలం క్రితం అసోం వరద బాధితులకు రెండు కోట్ల రూపాయల సాయం అందించిన అక్షయ్.. బీహార్ వరద బాధితులకు చేయూతనందించేందుకు ముందుకు వచ్చారు. 
ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 1కోటి రూపాయల చెక్‌ను అందచేశారు అక్షయ్. ఆయన ప్రకటించిన కోటి రూపాయల మొత్తంతో, కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున 25 బాధిత కుటుంబాలకు సాయం అందనుంది. ఛట్ పూజ సందర్బంగా అక్షయ్ ఈ కుటుంబాలకు నాలుగేసి లక్షల రూపాయల చొప్పున పంపిణీ చేయనున్నారు.

Read Also : చిరు చేతుల మీదుగా బిగ్‌బాస్ టైటిల్!

బీహార్ వరదల కారణంగా కొన్ని లక్షలమంది నిరాశ్రయులయ్యారు. వారికి ఉపాధి కరువయ్యింది. కనీసం తిండి కూడా అందక విలవిల్లాడిపోయారు. ఈ నేపధ్యంలో సీఎం రూ. 136.58 కోట్ల మొత్తాన్ని బాధితులను ఆదుకునేందుకు అందించారు. పకృతి వైపరీత్యాలు ఎదురైనపుడు బాధితులను ఆదుకోవడాని మరింతమంది ముందుకు రావాలని అక్షయ్ పిలుపునిచ్చారు.